ఆంధ్రోళ్లు..తెలంగాణోళ్లు ఏం రాయాలో చెప్పిన బాబు

0
339
Chandrababu Says Meaning About Andhra pradesh and Telangana In Mahanadu Meeting

ప్రేమించటం తప్పు లేదు. కానీ.. అందరూ తన లానే ప్రేమించాలని కండీషన్ పెట్టటంతోనే సమస్యచెబుతున్నారు బాబు.తాను అమితంగా ప్రేమించే అమరావతిని అందరూ అంతేలా ప్రేమించాలని.. ఆ మాటకు వస్తే అమ్మ స్థానాన్ని అమరావతికి ఇవ్వాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మహానాడులో చెప్పారు.ఎంత అమరావతి అయితే మాత్రం అమ్మ తర్వాతే కదా.

చరిత్రలో నిలిచిపోయేలా ఆంధ్రుల రాజధానిని నిర్మిస్తానని చెప్పిన చంద్రబాబు.. అమరావతి కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు.. ఆంధ్రుల రాజధాని అమరావతి అన్న విషయం మీద అటుపక్క రాయలసీమ వారికి.. ఇటు పక్క ఉత్తరాంధ్ర వారికి అసంతృప్తులన్నా.. ఇప్పుడన్నీ సద్దుమణిగాయి. అమరావతిని ఆంధ్రుల రాజధానిగా ఒప్పించటంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు.

తెలుగు అక్షర మాటలో అ అంటే అమ్మ.. ఆ అంటే ఆవు అని రాయటం దశాబ్దాల తరబడి ఉంది. కానీ.. ఇప్పడీ అక్షర మాలలో అ అంటే అమరావతి అని.. ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అని రాయాలంటూ కొత్త మాటను చెబుతున్నారు చంద్రబాబు. ఆంధ్రోళ్లకు సరే.. మరి తెలంగాణ వారి మాటేమిటంటే..త అంటే తెలంగాణ రాయాలని ఆయన చెబుతున్నారు.

Leave a Reply