టీవీ చానెల్స్ అమరావతి వస్తాయా?

 Posted October 19, 2016

chandrababu says news channels managers built news channels open in amaravathi
టీవీ చర్చల్లో టీడీపీ వాణి బలంగా వినిపించడం లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫీల్ అవుతున్నారు.అందుకే ఆ విషయం మీద దృష్టి పెట్టమని పార్టీ సీనియర్ నేతలకి హితవు చెప్పారు.సీనియర్ లు టీవీ చర్చల్ని నిర్లక్ష్యం చేస్తే నష్టం తప్పదని బాబు పార్టీ సమావేశంలో అభిప్రాయపడ్డారు.అయితే టీవీ స్టూడియో లన్నీ హైదరాబాద్ లో వున్నాయి..మనం ఇక్కడ ఉంటున్నాం అని సీనియర్ నాయకుడు బుచ్చయ్య చౌదరి ఇచ్చిన వివరణతో బాబు ఆలోచనలో పడ్డారంట. వెంటనే ఇక్కడ కూడా అంటే గుంటూరు లేదా విజయవాడ లో చిన్నపాటి స్టూడియో లు అయినా ఏర్పాటు చేసుకొనేలా ఛానల్ యాజమాన్యాలకు సూచించాలని పార్టీ ముఖ్యులకు ఆదేశించారు.

రాష్ట్ర విభజన అనంతరం ఈ టీవీ,టీవీ 9, ఎన్ టీవీ సహా కొన్ని ఛానెల్స్ రెండో ప్రధాన శాఖ విజయవాడలో ఏర్పాటు చేయాలని ప్రయత్నించాయి.ఎందుకో ఆ తర్వాత ఉన్న వ్యవస్థలతోటే సర్దుకుపోతున్నాయి.బాబు గారు చెప్పినట్టు విజయవాడ లో దాదాపు ముఖ్యమైన చానెల్స్ అన్నిటికి చిన్న స్టూడియో లు వున్నాయి .అయితే వాటిని అప్ గ్రేడ్ చేసుకుంటేనే హైదరాబాద్ తరహా చర్చలు చేపట్టగలరు.ఎక్విప్ మెంట్,మానవ వనరుల విషయంలో ఖర్చుతో కూడిన వ్యవహారమిది.ఇప్పటికే ఇంటర్ నెట్ ,సోషల్ మీడియా దెబ్బకి నష్టాలు చూస్తున్న టీవీ ఛానల్ యాజమాన్యాలు బాబు మాట విని అమరావతి వస్తాయా?ప్రభుత్వాలే మీడియాని నిర్దేశిస్తున్న రోజులు కదా ..ఏదైనా జరగొచ్చు .

SHARE