ఆ ఎన్నికలను తేలిగ్గా తీసుకోవద్దు.. చంద్రబాబు

Posted October 15, 2016

chandrababu-says-the-elections-should-not-be-taken-easy

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. టెలీకాన్ఫరెన్స్‌లో జిల్లా, రాష్ట్ర పార్టీ బాధ్యులు, టీడీపీ ఇంచార్జిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలుపొందాలన్నారు. ఓటర్ల నమోదుకు మరో 20 రోజులు గడువు ఉందని తెలిపారు. అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయాలని సూచించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో చూపే శ్రద్ధ పరోక్ష ఎన్నికల్లో చూపట్లేదన్నారు. సరైన ప్రణాళిక, సంస్థాగత నైపుణ్యంతో పరోక్ష ఎన్నికల్లో గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. నవంబర్‌ 5 వరకు జరిగే ఓటర్ల నమోదులో అందరూ ఉత్సాహంగా పాల్గొనాలని తెలిపారు.⁠⁠⁠⁠

SHARE