వైసీపీ నేతల టాయిలెట్ అవసరాలకి పోలవరం నీళ్లు?

Posted March 20, 2017

chandrababu says too ysrcp leader polavaram water will be used in ap assembly toilet
అసెంబ్లీ లో సీరియస్ గా కనిపించే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ప్రభావమో ..ఏమో గానీ చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు.తన ప్రసంగానికి వైసీపీ సభ్యులు అడ్డు తగులుతుంటే కూడా ఆయన నవ్వుతూనే చురకలు అంటించారు.విభజన నాటి పరిస్థితులకి,ఇప్పటి పరిస్థితుల్ని బాబు పోల్చి చెబుతూ …అప్పట్లో బస్సు లో పడుకున్నామని,ఇప్పుడు ప్రపంచ స్థాయి రాజధాని కట్టుకుంటున్నామని బాబు అన్నారు.దీంతో వైసీపీ సభ్యుడు ఒకరు టాయిలెట్ సరిగ్గా లేదుకానీ ప్రపంచస్థాయి రాజధానా అని కామెంట్ చేశారు.దీంతో ,మీకు టాయిలెట్ మాత్రమే సమస్య అని బాబు కౌంటర్ వేశారు. ఇంతలో సబ్జెక్టు పోలవరం మీదకి మళ్లింది. ఇంతకుముందు టాయిలెట్ విషయాన్ని గుర్తుంచుకున్న బాబు పోలవరం వద్దంటే మీకు టాయిలెట్ కి వెళ్ళడానికి నీళ్లు ఎలా వస్తాయని అడిగేసరికి అసెంబ్లీ లో నవ్వులు వినిపించాయి.

SHARE