బాబు బతిమాలారా?బెదిరించారా ?

  chandrababu scared or demanded to bjp politicianఆంధ్రాకి ప్రత్యేక హోదా కాని హోదా వస్తుందంటూ అటు ఢిల్లీ ఇటు అమరావతి నుంచి పుంఖానుపుంఖాలుగా వార్తలు,సంకేతాలు వస్తున్నాయి.వాతావరణం చూస్తుంటే కాస్త అటుఇటుగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరేట్టే కనిపిస్తోంది.ఆంధ్రాలో స్పష్టత లేని రాజకీయ చిత్రం చూశాక సొంతంగా ఎదగడానికి లేనిపోని ప్రయోగాలు చేసి తలనొప్పులు తెచ్చుకోవడం కన్నా పాత పద్దతిలోనే వెళ్లాలని కమలం పెద్దలు నిర్ణయించుకున్నారు.అడిగినంత కాకపోయినా చేయగలిగినంత చేసి మిత్రపక్షం టీడీపీ తో కలిసి ..పవన్ ముందుకొస్తే ముగ్గురితో జట్టుకట్టి ఎన్నికలు ఎదుర్కోవడం మేలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది.అది ఫైనల్ అయ్యాకే ప్రత్యేక ప్యాకేజ్,హోదా చర్చలు విస్తృతమయ్యాయి .

బీజేపీ ఈ నిర్ణయం తీసుకోడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన విడాకుల హెచ్చరికే కారణమని ఆంధ్రజ్యోతి చెప్తోంది.సుతిమెత్తగా అయన కేంద్ర పెద్దల్ని బెదిరించారని పరోక్షంగా వివరిస్తోంది.సహజంగానే సాక్షి రెండో సైడ్ నుంచి వాదిస్తోంది.ఢిల్లీలో ప్రధాని మోడీ ,బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మొదలైన వాళ్ళతో సుజనా &కో సాగిస్తున్న చర్చలు ఓటుకునోటు కేసు నుంచి తప్పించమని చంద్రబాబు బతిమిలాటేనంటోంది.సరే బాబు బతిమిలాడారో,బెదిరించారో మాకెందుకు ఈసారైనా హోదా లేదా ప్యాకేజ్ వార్తలు నిజమైతే చాలని జనం కోరుకుంటున్నారు.

SHARE