బాబుని ఉతికేసిన జ్యోతి రాధాకృష్ణ..

 Posted October 30, 2016

chandrababu should change by radhakrishna
  ‘మీరు కొంచెం మారాలి బాబు’ అంటూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆర్కే కొత్తపలుకు శీర్షికలో అంశాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.చంద్రబాబు వ్యవహారశైలిని తప్పుపడుతూ ఆర్కే రాసిన ఈ వ్యాసంలో బాబు గురించి అందరికీ తెలిసిన,అర్ధమవుతున్న విషయాలనే ఆర్కే ప్రస్తావించారు.అయితే అసలు ఆంధ్రజ్యోతిలో ఈ మధ్య కాలంలో బాబుని తప్పుబడుతూ ఈ స్థాయిలో వ్యాసం రావడమే ఆసక్తికరం,ఆశ్చర్యకరం.టెలీకాన్ఫెరెన్స్ ల పేరుతో సమయం వృధా అవుతున్న విషయాన్ని సూటిగానే చెప్పారు ఆర్కే .ప్రజలకి అరచేతిలో వైకుంఠం చూపించొద్దని …చేయగలిగింది చెప్పమని కూడా బాబుకి ఆర్కే సూచించారు.ఒక్క విషయంలో మాత్రం ఆర్కే విశ్లేషణ అంత కరెక్ట్ కాదేమో అనిపించింది.అయన చేసినదాన్ని రాజకీయంగా సరిగ్గా వాడుకోలేకపోతున్నారని అనడం నిజం కాదనిపిస్తోంది.ప్రత్యర్థుల రాజకీయ వ్యూహాలతో ముడిపడి ఉన్న రాజకీయ క్షేత్రంలో ఏకపక్షంగా ఆటాడ్డం కుదరదు.అందుకే రాజకీయ యవనికపై రెండో కోణం కూడా స్పష్టంగా కనిపిస్తోంది.ఏదేమైనా …బాబుని అప్రమత్తం చేసే వుద్దేశంతోనైనా అయన తప్పుల్ని ఎత్తిచూపడం ద్వారా వైసీపీ కి ఆంధ్రజ్యోతి ద్వారా ఇంకో అస్త్రం దొరికినట్టే.

SHARE