బీజేపీకి చంద్రబాబు సైలంట్ స్కెచ్

0
555
chandrababu silent sketch to bjp

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

chandrababu silent sketch to bjpఆపరేషన్ సెవన్ స్టేట్స్ ఎజెండాతో వేగంగా ముందుకు సాగుతున్న బీజేపీ నాయకత్వం ఏపీలో పాగా వేయడంపై సైతం దృష్టి సారించింది. 2019 ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసే బలాన్ని కూడగట్టాలని బీజేపీ జాతీయ నాయకత్వం దూకుడు పెంచుతోంది. ఈ ఏడాది జూలైలో ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల కు విశాఖను వేదికగా నిర్ణయించడం ఇందుకు నిదర్శనం అంటున్నారు. రాష్ట్రంలో అతి పెద్ద నగరంగా ఉన్న విశాఖ నుంచి పార్టీ విస్తరణ స్కెచ్ మొదలు పెట్టాలని బీజేపీ చూస్తోందని చెప్తున్నారు. అయితే బీజేపీ దూకుడును గమనించిన టీడీపీ సైతం విశాఖలోనే తన పార్టీ పండుగ అయిన మహానాడును ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారిందని విశ్లేషిస్తున్నారు.

సాధారణ ఎన్నికల వరకు బీజేపీతో సన్నిహితంగా ఉండకపోతే ఇబ్బందులొస్తాయనే చంద్రబాబు సంయమనం పాటిస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అయితే తమ సామర్థ్యం తక్కువగా అంచనా వేయవద్దనే ఉద్దేశంతోనే విశాఖ వేదికగా మహానాడు నిర్వహణ అనే ప్రణాళికను చంద్రబాబు సిద్ధం చేసినట్లు వివరిస్తున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు విశాఖను వేదికగా నిర్ణయించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సైతం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోందని. పార్టీ టీడీపీ కూడా విశాఖలోనే మహానాడు నిర్వహించాలని నిర్ణయించిందని వెల్లడిస్తున్నారు. మహానాడును పెద్ద ఎత్తున నిర్వహించి బీజేపీ తమతో సరితూగలేదన్న సంకేతాలు ఇవ్వాలన్నది బాబు ఎత్తుగడగా చెబుతున్నారు.

ఏపీలో అతి పెద్ద నగరంగా ఉన్న విశాఖలో బీజేపకి ఎంపీ – ఎమ్మెల్యేలున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీని సైతం బీజేపీ గెలుచుకుంది. ఈ దూకుడు ఇలాగే కొనసాగించేందుకు విశాఖ మున్సిపల్ ఎన్నికల్లోనూ మెజార్టీ వార్డులు కొట్టేయాలని బీజేపీ భావిస్తోంది. అయితే బీజేపీకి ఎమ్మెల్సీ సీటును కేటాయించడం కిందిస్థాయి టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజుతో జిల్లాకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధులకు పొసగడం లేదని ఇది అనేక సందర్భాల్లో బయటపడిందని అంటున్నారు. రాజధానిలో పెద్ద ఎత్తున ల్యాండ్ పూలింగ్ ను ప్రోత్సహిస్తున్న చంద్రబాబుకు విష్ణుకుమార్ రాజు వ్యవహారం తలబొప్పి కట్టించినట్లు తెలిసింది. అయినప్పటికీ వివిధ సమీకరణాల రీత్యా సీఎం చంద్రబాబు బీజేపీతో దూరం కావాలని కోరుకోవడం లేదని అంటున్నారు.

Leave a Reply