Sunday, May 22, 2022
Homelatestనవనిర్మాణ దీక్షలో బాబు చెప్పింది ఇదే .

నవనిర్మాణ దీక్షలో బాబు చెప్పింది ఇదే .

ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణదీక్షలో సీఎం చంద్రబాబు భావోద్వేగంతో మాట్లాడారు.విభజన కష్టాల్ని శ్రమతో అధిగమించాలని పిలుపు ఇచ్చిన బాబు నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకి దారి తీసిన పరిస్థితుల్ని కూడా వివరించారు.నవనిర్మాణ దీక్షలో బాబు మాటల బులెట్ పాయింట్స్ ఇవే .

  • ఇది రాష్ట్రానికి చీకటి రోజు. జీవితంలో మరిచిపోలేని రోజు మరవకూడని రోజు
  • ఈరోజు మీ అందర్నీ కష్ట పెడుతున్నాను మండుటెండల్లో మీరు వచ్చారు ఆ రోజును ఒకసారి గుర్తు చేసుకొని మళ్లీ రాష్ట్ర నిర్మాణానికి పునరంకితం కావాలని  మనం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.
  • మీ కష్టాలు నేను అర్థం చేసుకోగలను అన్నీ రాష్ట్రాలు రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరుపుకుంటాయి, అదే సమయంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటాం మనం నవ నిర్మాణ దీక్ష జరుపుకుంటాం.
  • రాష్ట్ర అవతరణ సంర్బంగా మనకు జరిగిన నష్టాన్ని నెమరు వేసుకుందాం మనం చాలా అవమానాలు పడ్డాం. ఇండ్లలో కూర్చొని  బాధపడితే లాభం లేదు కొన్ని దేశాలు మనకు ఆదర్శం కావాలి రెండో ప్రపంచంలో జపాన్ బూడిదయిపోయింది అయినా ఒక స్ఫూర్తితో ముందుకు వెళ్లి కష్టపడి దేశ నిర్మాణానికి పాటుపడ్డారు అచంచలమైన అభివృద్ది సాధించారు.
  • ఇంకా చాలా దేశాలు ఇలాంటి సమస్యల ఎదుర్కొన్నాయి వాళ్ల కష్టంతో తెలివితేటలతో పైకొచ్చారు.
  • మనం చరిత్ర ఒక సారి గుర్తు పెట్టుకొని భవిష్యత్తు కోసం మనం పునరంకితం అయ్యే రోజు జూన్2  తెలుగు జాతికి ఎంతో విశిష్టత, చరిత్ర ఉంది.
  • స్వాతంత్ర్యం రాకముందు మన రాజధానిగా చెన్నై ఉండేది, అప్పడు బ్రిటీష్ పాలనలో ఉన్నాం, అదే సమయంలో పొట్టి శ్రీరాములు గారు తెలుగు వారికి ఒక  రాష్ట్రం కావాలని పోరాటం చేసి ప్రాణత్యాగం చేశారు అప్పుడే తెలుగువారికి రాష్ట్రం వచ్చింది.
  • ఆరోజు మనకి అప్పులు లేవు కానీ కట్టుబట్టలతో కర్నూలుకు వచ్చాం. అనంతరం భాషా ప్రయుక్త రాష్ట్రా కోసం నాంది పలికింది ఆనాటి ఆంధ్రప్రదేశ్-హైదరాబాద్ కలయిక.
- Advertisment -
spot_img

Most Popular