బాబు రిపేర్ ఖర్చు చూస్తే గుండె బద్దలే..

 Posted October 28, 2016

chandrababu spending lot of money for amaravati developmentరాష్ట్ర విభజన తర్వాత ఎక్కడికెళ్లినా ముఖ్యమంత్రి చంద్రబాబు బీద పలుకులే పలుకుతున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఎంత దీనంగా ఉందో వివరిస్తుంటారు.అన్ని తెలిసిన అయన ఖర్చు మాత్రం ఓ రేంజ్ లో వుంది.అయన నివాసం వుంటానికి ఇల్లు కొనడానికి కాదు ..రిపేర్ చేయించడానికి ఈ రెండున్నరేళ్లలో ఎంత ఖర్చు పెట్టారో ఓ లుక్ వేయండి.

ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీ వెళ్ళినప్పుడు ఉండటానికి కేంద్రం 1 జన్ పథ్ లో ఓ భవనాన్ని కేటాయించింది.అప్పట్లో లోకేష్ బాబుని ఢిల్లీ రాజకీయాల్లో ప్రవేశపెడదామని బాబు భావిస్తున్న కాలమది.ఇంకేముంది చక చకా ఆ భవన రిపేర్ పనులు మొదలెట్టారు.లోకేష్ ఢిల్లీ వెళ్ళలేదుగానీ ఆ ఇంటి మరమ్మత్తులకు 5.82 కోట్లు ఖర్చు పెట్టారు.జీవో 2209 ద్వారా ఆ మొత్తం విడుదలకి సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి.లేక్ వ్యూ కోసం దాదాపు 5 కోట్లు, మదీనాగూడలో ఓ ప్రైవేట్ ఇంటి కోసం 1.32 కోట్లు ఖర్చుబెట్టారు.అందులో అయన కనీసం నెల రోజులు కూడా లేరు.

ఇక అమరావతి బాట పట్టాక అయిన ఖర్చు ఇంకా ఎక్కువ.లింగమనేని గెస్ట్ హౌస్ లో మార్పులు,రోడ్డు ,భద్రత ఏర్పాట్ల కోసం చేసిన వ్యయం దాదాపు 30 కోట్లు ఉండొచ్చు.విజయవాడలో తాత్కాలిక క్యాంపు కార్యాలయానికి దాదాపు 40 కోట్లు వెచ్చించినట్టు తెలుస్తోంది.ఇవన్నీ చూసాక బాబుని కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి సిఎం అని ఎవరైనా అంటారా?

SHARE