ఇక్కడ కూడా సర్వే లా బాబు?

 chandrababu survey pushkaralu
ఏపీ సీఎం చంద్రబాబుకి సర్వేల మీద ఎంత గురో అందరికీ తెలిసిందే.పార్టీలో నేతల పనితీరు మొదలుకొని ప్రభుత్వ పధకాల దాకా,అధికారుల పనితీరు మొదలుకొని..సామాన్యుల మనోభీష్టం తెలుసుకొనే దాకా …సర్వే ల మీద బాబు ఆధారపడతారు.ఇప్పుడు ఆంధ్రాకి సంబంధించి సమగ్ర సర్వే ఒకటి సాగుతోంది. అయితే పుష్కరాలు రావడంతో ఆ సర్వేకి తాత్కాలిక బ్రేక్ ఇచ్చారు.అధికారులు అమ్మయ్యా అనుకున్నారు.

చంద్రబాబు గారు ఊరుకోలేదు…పుష్కర ఏర్పాట్లు మీద సర్వే చేయించమని ఆదేశించారు.ఇది ఒకటి రెండు సార్లు కాదు …పుష్కరాలు జరిగినన్ని రోజులు సర్వే సాగుతుందని చెప్పారు .అబ్బా మరో 12 రోజులు నిత్య పరీక్షా అని తలలు పట్టుకున్నారు.ఇవన్నీ పట్టని బాబు గారు పరమ ఉత్సాహంగా తొలిరోజు పూర్తి కాగానే సర్వే ఫలితాలు ప్రకటించారు …

• అభిప్రాయ సేకరణలో భాగంగా 26 ప్రశ్నలకు యాత్రికులు ఇచ్చిన సమాధానాల గురించి టెలీకాన్ఫరెన్స్ లో వివరించిన సీఎం చంద్రబాబు

• పుష్కర సమాచార కేంద్రాలు ఉన్నాయని 96 శాతం మంది పేర్కొనగా, లేవని 3.47 % పేర్కొన్నారు : ముఖ్యమంత్రి చంద్రబాబు

• విద్యుత్ సౌకర్యంపై 70 శాతం మంది బాగుంది అనగా , 15 శాతం ఫర్వాలేదని, 8 శాతం బాగాలేదని , 7 శాతం తెలియదని చెప్పారు : టెలీకాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు

• ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లపై బాగుందని 81 % పేర్కొనగా , ఫర్వాలేదని 12 శాతం మంది, బాగాలేదని 7 శాతం మంది అన్నారు : టెలీకాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు

• తాగునీటి సదుపాయం బాగుందని 83 శాతం పేర్కొనగా, బాగాలేదని 14.68 శాతం తెలిపారు : సీఎం చంద్రబాబు

• ఆహార సదుపాయం బాగుందని 72 శాతం పేర్కొనగా, 18 శాతం ఫర్వాలేదని, 8 శాతం బాగాలేదని అన్నారు : ముఖ్యమంత్రి చంద్రబాబు

• పారిశుద్ధ్యం బాగుందని 83 శాతం అనగా, ఫర్వాలేదని 16 శాతం , బాగాలేదని 1 శాతం అన్నారు : టెలీకాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు

• పోలీసుల పనితీరు పట్ల 83.18 % బాగుంది అనగా, 15 శాతం బాగాలేదని అన్నారు : టెలీకాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు

• ఘాట్లలో నీటి పరిశుభ్రత, పుష్కర నగర్ లలో పారిశుద్ధ్యం, ఇతర సదుపాయాలపై వేసిన ప్రశ్నలకు ప్రజల అభిప్రాయాలను వివరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

• పుష్కర ఏర్పాట్లలో అన్ని శాఖల పనితీరుపై ప్రజల్లో 95 శాతం సంతృప్తి రావాలి : టెలీకాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు

SHARE