నీటి యుద్ధాలతో అశాంతి… చంద్రబాబు బుల్లెట్ పాయింట్స్

 •  chandrababu teleconference about water resource
 • ‘నీరు-ప్రగతి’ పై అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
 • నీటి సంక్షోభం దుష్పలితాలకు ఉదాహరణే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో ఘర్షణలు: టెలీ కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు
 • నీటి కోసం ప్రజల మధ్య ఘర్షణలు రాష్ట్రాలలో అశాంతికి దారితీయడం బాధాకరం : ముఖ్యమంత్రి చంద్రబాబు
 • రాష్ట్రంలో భావితరాలకు నీటి సంక్షోభం తలెత్తకూడదు, అందుకే ‘నీరు-ప్రగతి’ కి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం: ముఖ్యమంత్రి చంద్రబాబు
 • నీటి సంక్షోభాన్ని అధిగమిస్తే వ్యవసాయం, పారిశ్రామిక రంగాలతోపాటు అన్నిరంగాలలో ప్రగతి సాధిస్తాం: ముఖ్యమంత్రి చంద్రబాబు
 • భూగర్భజలాలను పెంపొందించడం, బోర్ వెల్స్ రీఛార్జింగ్ , సమర్ధ నీటి నిర్వహణ, చెరువుల పునరుద్దరణపై అధికార యంత్రాంగం దృష్టిపెట్టాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు
 • మన భవిష్యత్తు మనచేతిలోనే ఉంది, మన పని మనం చేయకుండా ఎవరినో తప్పు పట్టడం తగదు: టెలీ కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు
 • రాష్ట్రంలో ఎక్కడా భూగర్భజలం 80మీటర్ల లోతున ఉండే పరిస్థితి ఇకపై చెల్లదు: ముఖ్యమంత్రి చంద్రబాబు
 • 80మీటర్ల లోతున ఉన్నప్రాంతాలలో భూగర్భజలాన్ని 20మీటర్ల లోతుకు తీసుకురావాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు
 • ప్రతి మండలంలో 10 చెరువులు పునరుద్దరణ జరగాలి: టెలీ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు
 • ఈ సీజన్ లో ఎంత నీటిని నిల్వచేయగలమో అంత నిల్వచేయాలి, భూగర్భజలాలు పెంచాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు
 • జలవనరులు, వ్యవసాయం,అటవీ శాఖలు సమన్వయంగా పనిచేయాలి, నిధులు కన్వర్జెన్స్ చేయాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు
 • వాననీటి సంరక్షణ, భూగర్భజలాల పెంపు, చెరువుల పునరుద్ధరణలో లక్షమంది ఇంజనీరింగ్ విద్యార్ధుల సేవలు వినియోగించుకోవాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు
 • నాటిన మొక్కలకు జియో ట్యాగింగ్ 4వ శనివారం కల్లా పూర్తిచేయాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు
 • పక్కాగృహాల నిర్మాణం పనులు వేగవంతం చేయాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు
 • సీసీ రోడ్ల నిర్మాణం 40% పూర్తయ్యింది, మిగిలిన లక్ష్యం త్వరితగతిన పూర్తిచేయాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు
 • 6లక్షల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తిచేసి, రాష్ట్రంలో 55 నియోజక వర్గాలను ఓడీఎఫ్( బహిరంగ విసర్జనలేని వాటిగా) ప్రకటిస్తాం: ముఖ్యమంత్రి చంద్రబాబు
 • వర్మికంపోస్టు ప్లాంట్ల ఏర్పాటు, హార్టీకల్చర్ ప్లాంటేషన్ పనులను వేగవంతం చేయాలి: టెలీ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు
SHARE