బాబుకి టెలిటోపీ పెడ్తున్నది ఎవరు..?

0
555

Posted [relativedate]

cm-topi

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లకి పెట్టింది పేరు. విషయం ఏదైనా వెంటనే అధికారులతో టెలికాన్ఫరెన్స్ పెట్టడం ఆయనకు అలవాటైపోయింది. దీనితో కొన్ని సార్లు అవసరం లేని అంశాల్లో కూడా వందల మంది ఉద్యోగుల సమయం వృధా అవుతున్న సందర్భాలున్నాయి. అయినా బాబు దాకా ఈ విషయం చేరవేసే వాళ్ళు ఎవరున్నారు..? అప్పటికీ బాబు ఏం చేసినా బ్రహ్మాండం అని చెప్పే ఆంధ్రజ్యోతి లాంటి పత్రిక సైతం టెలికాన్ఫరెన్స్ లు అధికారుల పనికి ఇబ్బందిగా మారుతున్నాయని… ఆఫీసర్లు గంటల కొద్దీ కాన్ఫరెన్స్ లో కూర్చోవడం వల్ల కార్య కలాపాలు ముందుకు సాగడం లేదని చెప్తూ పరోక్షం గా ఓ కధనం రాసింది.. ఆ పత్రిక మొహమాటం పడిందేమోగాని బాబు గారి కాన్ఫరెన్స్ అనగానే కొందరు అధికారులు బోర్ పీలవుతున్నారు..

బాబు గారి కాన్ఫరెన్స్ లో నుంచి తప్పించుకునేందుకు కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. ఫోన్ లు ఆన్ చేసి కాన్ఫరెన్సులో అటెండన్స్ వేయించుకొని తమ పనుల్లో పడిపోతున్నారు. తమ వంతు వచ్చే టైం ను బట్టి కాస్త ఎలర్ట్ అయ్యి అప్పటికే ఆ పని కానిచ్చేస్తున్నారు. ఇంతక ముందు కూడా కొంత మంది అధికారులు ఇలా చేసేవాళ్ళు. విషయం కాస్త సీక్రెట్ గా ఉండేది. ఇప్పుడు సీన్ మారిపోతుంది. సీక్రెట్ ఓపెన్ అయిపోయింది. బాబు కి టెలి టోపీ పెడుతున్న ఆఫీసర్ల సంఖ్య పెరిగింది.. కానీ ఎవరేం చేసినా అసలాయన దాకా విషయం వెళ్లడం లేదు. అలా వెళ్లాలనే అధికారులు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆ తర్వాత అయినా బాబు గారి శైలి మారుతుందని వారి ఆశ…

Leave a Reply