విద్యాశాఖ పై బాబు.. బుల్లెట్ పాయింట్స్

0
402
chandrababu teleconference on education department

 Posted [relativedate]

chandrababu teleconference on education departmentవిద్యాశాఖ అధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు… అందులో ప్రాథమిక విద్య, ఉన్నత విద్య,సాంకేతిక విద్యాశాఖల అధికారులు, వైస్ ఛాన్సలర్లు, ప్రిన్సిపాళ్లు, హెడ్ మాస్టర్లు పాల్గొన్నారు.

 • సమాజంలో మానవ వనరులు అతి కీలకం. వాటిని సద్వినియోగం చేసుకో వాల్సిన బాధ్యత అందరిపై ఉంది: సీఎం చంద్రబాబు
 • చదువు అనేది ప్రాథమిక హక్కు. పిల్లల భవిష్యత్తును కాలరాసే హక్కు ఎవరికీ లేదు: సీఎం చంద్రబాబు
 • అందరినీ చదివించాలి, ప్రయోజకులను చేయాలి: సీఎం చంద్రబాబు
 • విజ్ఞానాన్ని వినియోగించుకుని ఫలితాలను రాబట్టగలిగితే సమాజంలో సంపద సృష్టించబడుతుంది: సీఎం చంద్రబాబు
 • ఆత్మవిశ్వాసం పెంచేందుకే బాలికలకు సైకిళ్లు పంపిణీ చేస్తున్నాం: సీఎం చంద్రబాబు
 • ప్రాథమిక విద్య, ఉన్నతవిద్య, సాంకేతిక విద్య అనుసంధానం జరగాలి: సీఎం చంద్రబాబు
 • పాఠశాలలు, కళాశాలలు పవిత్ర దేవాలయాలే కాదు, పరిశుభ్రమైన ప్రాంతాలుగా రూపొందాలి: సీఎం చంద్రబాబు
 • అక్కడనుంచి ఐడియాలు రావాలి, పరిశోధనలు చేయాలి, ఫలితాలు రాబట్టాలి: సీఎం చంద్రబాబు
 • వైద్యవిద్యార్ధి, పారామెడికల్ విద్యార్ధి, ఫార్మసీ విద్యార్ధులతో మల్టీ స్టూడెంట్ డిసిప్లిన్ టీములు ఏర్పాటు చేయాలి: సీఎం చంద్రబాబు
 • సంచార వైద్యశాలల్లో వెళ్లి ఆయా గ్రామాలలో పర్యటించాలి. అనారోగ్య సమస్యల కారణాలు విశ్లేషించాలి. అవి ఉత్పన్నం కాకుండానే పరిష్కారమార్గాలు అధ్యయనం చేయాలి: సీఎం చంద్రబాబు
 • గ్రామీణుల ఆరోగ్యంపై వైద్యవిద్యార్ధులు, పంటసంజీవని, జల సంరక్షణపై ఇంజనీరింగ్ విద్యార్ధులు క్షేత్రస్థాయికివెళ్లి పరిశోధనలు, అధ్యయనం చేయాలి: సీఎం చంద్రబాబు
 • సమాజంలో సంపద సృష్టించాలి, ఉపాధి కల్పించాలి, వాటిద్వారా ఆనందమయ సమాజం ఏర్పడాలన్నదే విద్యాశాఖ లక్ష్యంకావాలి: సీఎం చంద్రబాబు
 • దేవాలయాలలో అన్నదానానికి, ప్రాణదానానికి సీఎస్ ఆర్ కింద నిధులు ఇవ్వడానికి అనేక సంస్థలు ముందుకు వస్తున్నట్లే విద్యాదానానికి నిధులు ఇవ్వడానికి సంస్థలను ప్రోత్సహించాలి: సీఎం చంద్రబాబు
 • దేవాలయాల్లో ఏవిధంగా అయితే ప్రతిరోజూ అన్నదానానికి కార్ఫస్ ఫండ్ పోగవుతుందో అదేవిధంగా విద్యాదానానికి కూడా ఆయా విద్యాసంస్థలలో కార్పస్ ఫండ్ పోగయ్యేలా చూడాలి: సీఎం చంద్రబాబు
 • ప్రిన్సిపాల్ అధ్యక్షతన, విద్యార్దులు, అధ్యాపకులతో ప్రతి కళాశాలలో, పాఠశాలలో ఇన్నోవేషన్ టీములు ఏర్పడాలి. ఇంక్యుబేషన్ పట్ల ఆసక్తి పెరగాలి: సీఎం చంద్రబాబు
 • ప్రతి కళాశాలలో, పాఠశాలలో పోటీతత్వం స్ఫూర్తి పెంపొందాలి. ప్రతి కళాశాల ఇతర కళాశాలలతో, ప్రతి పాఠశాల ఇతర పాఠశాలలతో ఇన్నోవేషన్ లో పోటీపడాలి: సీఎం చంద్రబాబు
 • మనరాష్ట్రంలో ప్రభుత్వ కళాశాలనుంచి 13 పిహెచ్ డీలు రావడం మనందరికీ గర్వకారణం, ఇది అందరికీ స్ఫూర్తిదాయకం కావాలి: సీఎం చంద్రబాబు

Leave a Reply