స్మార్ట్ విలేజ్ పై బాబు బులెట్ పాయింట్స్ …

Posted [relativedate]

chandrababu teleconference on smart village with nri and ias officers స్మార్ట్ విలేజి-స్మార్ట్ వార్డుపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్..పాల్గొన్నఎన్నారైలు,ఎన్నార్వీలు, పార్టనర్లు,జిల్లాల కలెక్టర్లు,అధికారులు

  • మనం ఎంత పెద్దవాళ్లమయినా మన మూలాలు గ్రామాల్లోనే ఉంటాయి: ముఖ్యమంత్రి చంద్రబాబు
  • మనతో పుట్టినవారు ఇంకా గ్రామాల్లో నివసించేవారు ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది: ముఖ్యమంత్రి చంద్రబాబు.
  • కన్నతల్లికంటే జన్మభూమి గొప్పది, పుట్టిన ఊరు రుణం తీర్చుకోవాల్సిన సందర్భం ఇది: ముఖ్యమంత్రి చంద్రబాబు.
  • మీ విజ్ఞానాన్ని, అనుభవాలను, శ్రద్ధను గ్రామాల అభివృద్దిపై పెట్టాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు.
  • స్వయంకృషితో పైకొచ్చిన మీరంటే మీ గ్రామంలో ఎంతో ప్రేమ, గౌరవం. స్వగ్రామాల అభివృద్దితో ఆ గౌరవాన్ని చిరస్థాయిగా నిలబెట్టుకోవాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు
  • ఈరోజు మనవాళ్లు ప్రపంచం అంతా వెళ్లారు, రేపు ప్రపంచం మొత్తం మనవద్దకు రావాలి: టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు
  • జన్మభూమి కూడా ఒక పండగ లాంటిది: ముఖ్యమంత్రి చంద్రబాబు
  • సంక్రాంతికి స్వగ్రామానికి వెళ్లినట్లే జన్మభూమికి కూడా అందరూ వెళ్లాలి, అభివృద్దిలో భాగస్వాములు కావాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు

Leave a Reply