ఆ రోజెప్పుడో ఇక బాబు చెప్పాలి ..

0
439

    chandrababu tell when ap state independence day
విభజనతో ఆంధ్రప్రదేశ్ కి ఓ రోజు కరువైపోయింది ..అదే రాష్ట్రావతరణ దినం..విభజనకు ముందు నవంబర్ 1 న రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించేవాళ్ళు..ఆ తర్వాత June 2 న తెలంగాణ ఘనంగా ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది.అయితే విభజనతో నష్టపోయిన రోజు రాష్ట్రావిర్భావ దినం జరపడం సముచితం కాదని ముఖ్యమంత్రి చంద్ర బాబు భావిస్తూ వచ్చారు.

జూన్ 2 న పునరంకిత సభలు,దీక్షలు జరుపుతూ వచ్చారు.ఏపీ లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ జూన్ 8 వ తేదీని కూడా అవతరణ దినం కోసం పరిశీలించారు.అయితే దానిపై కూడా రాష్ట్రప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయలేదు.దీంతో కొందరు ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు .దానిపై స్పందించిన కేంద్రం రాష్ట్ర సాధారణ పరిపాలన విభాగానికి ఓలేఖ రాసింది.అందులో నవంబర్ 1 న రాష్ట్రావతరణ దినంగా జరుపుకోవచ్చని కేవలం సూచన చేసింది .ఇక దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబే ..

Leave a Reply