వంగవీటితో టెన్షన్ లో చంద్రబాబు!!

0
458
chandrababu tension on vangaveeti movie

Posted [relativedate]

chandrababu tension on vangaveeti movie
వంగవీటి మోహన రంగ జీవితం ఆధారంగా రాంగోపాల్ వర్మ రూపొందించిన చిత్రం వంగవీటి. మూవీలో రామూ ఎవరిని హైలైట్ చేశారన్నది పక్కనబెడితే.. కాపు ఉద్యమానికి ఈ వంగవీటి ఊపు తెస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈనెల 26న వంగవీటి రంగా వర్థంతి. సరిగ్గా ఇదే సమయంలో సినిమా వచ్చేసింది. ఇదే అదనుగా ఉద్యమానికి పదును పెట్టేందుకు ముద్రగడ పద్మనాభం ప్లాన్ చేస్తున్నారట.

గత ఎన్నికల్లో టీడీపీ కాపులోని బీసీల్లోకి చేరుస్తామని మేనిఫెస్టోలో చెప్పింది. అనుకున్నట్టే లాభం కూడా పొందింది. కానీ ఆ హామీ నిజం కాలేదు. ఇప్పుడు ఈ డిమాండ్ ఊపిరిలూదేందుకు ముద్రగడ సిద్ధమవుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో వంగవీటి వచ్చింది. దీంతో కాపుల్లో ఆ ఎమోషన్ ను ఇది క్రియేట్ చేసిందని చెబుతున్నారు. దీనికి ముద్రగడ కొంచెం ఊపునిస్తే చాలు.. కాపు ఉద్యమం మహోదృతం అయ్యే అవకాశాలున్నాయి.

వంగవీటికి ముద్రగడ తోడైతే.. అగ్నికి ఆజ్యం పోసినట్టేనని భావిస్తున్నది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పటికే బాబు కూడా కాపు ఉద్యమంపై ఆరా తీశారట. వంగవీటి ప్రభావం ఎలా ఉంటుందోనని కాపు మంత్రులను అడిగి తెలుసుకున్నారట. అయితే వాళ్లంతా కాపు ఉద్యమానికి సపోర్ట్ గానే మాట్లాడారని టాక్. ఏదో ఒకటి తేల్చేయపోతే కాపులను కంట్రోలో చేయలేమని గట్టిగానే చెప్పారట. ఎందుకంటే ముద్రగడకు ఇప్పుడు చిరంజీవి, దాసరి, బొత్స లాంటి మహామహులు ఇప్పటికే అభయమిచ్చారు. ఈ నేపథ్యంలో బాబు సర్కార్ వంగవీటి ప్రభావం ఎంత ఉంటుందోనని టెన్షన్ పడుతోందట.

Leave a Reply