చంద్రబాబు కష్టమేనా కోదండ?

0
465

 chandrababu tough kodandaram kcr sarkar phone tapping
ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో …రేవంత్ అరెస్ట్ అయిన వేళ …చంద్రబాబుపై అందరూ వేలెత్తి చూపుతున్న వేళ ….అందరూ ఏమి జరుగుతోందో అని ఎదురుచూస్తున్న వేళ…ఆ ఒక్క ఆరోపణ అన్నిటినీ మార్చేసింది …అదే ఫోన్ ట్యాపింగ్…చంద్రబాబు ప్రయోగించిన ఆ అస్త్రం కేసీఆర్ స్పీడ్ కి బ్రేకులేసింది. బాబు మరో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కావడంతో మొత్తానికి ఆ అంశం మరుగున పడినట్టే వుంది.కానీ ఇప్పుడు అదే కష్టం తనకూ వచ్చిందంటున్నారు తెలంగాణ జె.ఏ.సి .చైర్మన్ కోదండరాం .

కేసీఆర్ సర్కార్ తన ఫోన్ ట్యాప్ చేస్తోందని కోందండ ఆరోపించారు.ఈ విషయం తనకెప్పుడో తెలిసినా ఆధారాలు లేక ఇన్నాళ్లు మౌనం వహించినట్టు అయన చెప్పారు .ఇప్పుడు తగిన ఆధారాలు లభించడంతో గొంతెత్తినట్టు కోదండ తెలిపారు.ఉద్యమాలని అణచివేస్తే మనుగడ ఉండదని అయన సర్కార్ కి హెచ్చరికలు జారీ చేశారు.

అయితే కేసీఆర్ వ్యవహారశైలి కన్నా ఒకప్పుడు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మిగతా సంఘాలు,శక్తులు మౌనం వహించడం కోదండని బాగా బాధిస్తోందట.అంతే కదా ప్రజాక్షేత్రంలోకి వచ్చాక కృతజ్ఞతలు ఆశించడం అత్యాశే …చూస్తున్నాం కదా మణిపూర్ ఉక్కుమహిళ షర్మిల పరిస్థితి ..16 ఏళ్ళు దీక్ష చేసిన ఆమె అది మానేసిన 16 గంటలు గడవక ముందే విమర్శించిన సమాజం మనది..

Leave a Reply