బాబు ,వెంకయ్య మధ్య కుదిరిన రహస్య ఒప్పందమిదేనా?

 Posted October 29, 2016

chandrababu venkaiah naidu between secrete relationship
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు,కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మధ్య సంబంధాల్ని ప్రత్యర్థి పార్టీలు ఎత్తి చూపుతుంటాయి.బీజేపీ లో బాబంటే పడని నేతలకి కూడా అదో అస్త్రం. అప్పట్లో ఈ ఆరోపణలు,విమర్శల గురించి బాబు,వెంకయ్య పెద్దగా పట్టించుకొనేవాళ్ళు కాదు.కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా బదులు ప్యాకేజ్ ఇవ్వడంతో వెంకయ్యకి ఇక్కడ పని పెరిగింది…అదేనండి విమర్శలకు సమాధానాలిచ్చే పని..ఆ పనిలో పనిగా బాబు ఎపిసోడ్ గురించి కూడా ఆయన వివరణ ఇచ్చేస్తున్నారు.బాగా పనిచేస్తున్నాడు కాబట్టే పొగుడుతున్నా…తప్పేంటని ఎదురు ప్రశ్నిస్తున్నారు వెంకయ్య.దీంతో అసలా ఇద్దరి మధ్య ఫెవికాల్ బంధం ఏమిటో అని గుసగుసలు ఇంకాస్త ఎక్కువయ్యాయి.

తాజా గుసగుసలకి చెక్ పెట్టే పనికి దిగాడు ఓ నాయకుడు.అయన టీడీపీ,బీజేపీ లకి బద్ధ శత్రువైన కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య .అయన వెంకయ్య ,బాబు మధ్య కుదిరిన రహస్య ఒప్పందం ఇదేనంటూ బయటపెట్టాడు.ఇంతకీ ఆ రహస్యం ఏమిటంటే …నువ్వు నన్ను పొగుడు..నేను నిన్ను పొగుడుతా అని బాబు, వెంకయ్య ఒప్పందానికి వచ్చారంట.

SHARE