మీ ఇగో మీతోనే పోదు…పార్టీకి కూడా.. బాబు భయం

Posted October 7, 2016

 chandrababu warning tdp leaders

పార్ట్ టైం పాలిటిక్స్‌కు కాలం చెల్లిందని…నిరంతరం ప్రజల్లో ఉండాలని చంద్రబాబు అన్నారు. మీ పనుల్లో కుటుంబ సభ్యుల ప్రమేయం ఉండకుండా చూడాలని సీఎం సూచించారు. మీ ఇగో మీతోనే పోదు. పార్టీకి కూడా అంటుకుంటుందని చంద్రబాబు గుర్తు చేశారు. మనల్ని మనమే ఇరుకున పెట్టుకునేలా వ్యవహరించకండని ఆయన అన్నారు. ప్రభుత్వంపై పట్టు సాధించాం..పరుగులు తీయిస్తున్నామని సీఎం చెప్పారు. నియోజకవర్గాలపై మీ పట్టు సడలనివ్వకండని టీడీపీ నాయకత్వ సాధికారత వర్క్ షాప్‌లో నేతలకు చంద్రబాబు స్పష్టం చేశారు.

గత ఎన్నికల్లో మనకు మద్దతు ఇవ్వని వర్గాలు కూడా ప్రస్తుతం మన సంక్షేమ కార్యక్రమాలతో చేరువవుతున్నారని సీఎం అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ వర్గాలకు చేసిన ప్రయోజనాలను జనచైతన్య యాత్రలలో వివరించాలని సీఎం చంద్రబాబు తెలిపారు. గత రెండున్నరేళ్లలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

SHARE