పోలవరం పై బాబు సమీక్ష…

Posted on September 26, 2016

 chandrababu watched drone cameras polavaram project 

పోలవరం పనులను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు , పాల్గొన్న జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమ, పోలవరం కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారులు

• కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి లైవ్ కెమెరాల ద్వారా పోలవరం పనులను ప్రత్యక్షంగా పరీశిలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
• గతం వారం రోజుల్లో 3.05 లక్షల క్యూబిక్ మీటర్ల పని జరిగిందని ముఖ్యమంత్రికి వివరించిన పోలవరం ప్రాజెక్టు ఎస్ ఈ

• గోదావరికి 10 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చినా పోలవరం పనులు ఆగవని ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు
• గోదావరికి 14 లక్షల క్యూసెక్కుల వరదనీరు వస్తేనే పనులకు కొంతమేర ఆటంకం కలగవచ్చని సీఎంకు తెలిపిన అధికారులు

• పోలవరంలో రోజుకు 44 వేల క్యూబిక్ మీటర్ల పని జరిగింది
• స్పీల్ వే నిర్మాణానికి గంటకు 700 క్యూబిక్ మీటర్ల నీటిని తోడే యంత్రాలను వినియోగిస్తూ నీటిని తొలగిస్తున్నామని ముఖ్యమంత్రి వివరించిన అధికారులు
• మొత్తం నీటిని తొలగించడానికి 15 రోజులు పడుతుందని ముఖ్యమంత్రికి వివరించిన జలవనరుల శాఖ అధికారులు

SHARE