బాబుకి ఆ స్వామి దర్శనం ..వైసీపీ సంబరం

0
665

 chandrababu-went-amaravati-amareswara-swamy-templeఅమరావతి సెంటిమెంట్ … ఇప్పుడు వైసీపీ శ్రేణుల్ని ఊరిస్తోంది.తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన దగ్గరనుంచి జోస్యుల మాట నమ్మి అది బతికి బట్టకట్టేది రెండేళ్లే అని ఆ పార్టీ అధినేత జగన్ స్వయంగా చెప్పారు.వెళ్లిన ప్రతిచోటా ఈ రెండేళ్లు ఆగితే మన ప్రభుత్వమే వస్తుందని చెప్పేవాళ్ళు .అనుకున్న సమయం దగ్గరపడేకొద్దీ జగన్ ఉత్సాహం ఎక్కువై,ఈ ప్రభుత్వం నేను తల్చుకుంటే ఎంత అనేశారు. బాబుగారికి మండిపోయి ఆపరేషన్ ఆకర్ష్ కి తెర లేపడంతో సీన్ రివర్స్ అయ్యింది.అనుకున్న రెండేళ్లు గడిచేసరికి సర్కార్ పడిపోలేదు గానీ ఈడీ అటాచ్ మెంట్ లు దర్శనమిచ్చాయి .దాంతో ఎప్పుడూ లేని పూజలు, వ్రతాలు చూశాం.

ఇంతలో సీఎం చంద్రబాబు పుష్కర ఏర్పాట్లలో భాగంగా అమరావతి వెళ్లారు .అమరేశ్వర ఆలయం సందర్శించారు.ఇంకేముంది తమ పూజలు ఫలిస్తాయని ఫ్యాన్ క్యాంపు లో సంబరాలు మొదలయ్యాయి.ఇది మోకాలికి,బోడిగుండుకు ముడిపెట్టడం అనుకోవద్దు …దీని వెనుక ఏ లాజిక్ లేని ఓ సెంటిమెంట్ వుంది.ఎవరైనా కీలక పదవుల్లో వున్నవాళ్లు అమరేశ్వర ఆలయానికి వస్తే ఆ హోదా ఊడిపోతుందని కొందరి నమ్మకం.దీనికి ఉదాహరణగా 1980 లో కృష్ణ పుష్కరాలకు వచ్చిన నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఆ తర్వాత పదవి కోల్పోయారట.

ఈ విషయాన్ని ఓసెంటిమెంట్ గా ప్రచారం చేశారు.ఇంకేముంది రాజకీయ నాయకులు అటు వైపు వెళ్లడం మానేశారు.ఇటీవల అమరావతి దాకా వచ్చిన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు బయట శిలాఫలకం వేసి గుడికి రాకుండానే వెళ్లిపోయారు.అది సెంటిమెంట్?లేక సమయాభావమా ఎవరికీ తెలియదు .కానీ ప్రచారం మాత్రం సెంటిమెంట్ అనే జరిగింది.ఇక రాజధానికి అమరావతి పేరు పెట్టిన చంద్రబాబు కూడా ఇప్పటి దాకా ఆలయానికి రాకపోవడంతో ఆ సెంటిమెంట్ ప్రచారం జోరందుకొంది .

ఇంతలో ఆ సెంటిమెంట్ ని బద్దలు కొడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి వెళ్లడంతో పాటు దైవదర్శనానికి కూడా వెళ్లారు.ఇది తెలిసిన కొద్ది నిమిషాలకే సోషల్ మీడియాలో వైసీపీ అనుకూల వర్గాలు బాబు అమరేశ్వరఆలయానికి వెళ్లిన విషయాన్ని జోరుగా ప్రచారం చేశారు.పండగ పండగ చేశారు.అమరావతి సెంటిమెంట్ ప్రకారం ఏదో జరగాలని వారి ఆరాటం,ఉబలాటం ..రెండేళ్ళ జోస్యం ఫెయిల్ అయి డీలా పడ్డవారికి ఇదో హుషారు నిచ్చే వార్త అయింది.ఒక సారి దెబ్బ తిన్న దారినే నమ్ముకుంటున్నవాళ్ళని ఏమనగలం ? చూస్తూ ఉండటమే…ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం .amaravthi temple cm (2)

amaravthi temple cm (3)

amaravthi temple cm (1)

Leave a Reply