Posted [relativedate]
ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి ఏపీ సీఎం చంద్రబాబు సంచలన లేఖ రాశారు. 1000, 500 రూపాయల నోట్లను రద్దు చేయాలని లేఖలో ప్రధానిని కోరారు. నల్లధనాన్ని కట్టడి చేయాలంటే వెయ్యి, ఐదువందల రూపాల నోట్లను రద్దు చేయాలని చంద్రబాబు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. పెద్ద నోట్లను రద్దు చేసి, నగదు రహిత కొనుగోళ్లను ప్రోత్సహించాలని ప్రధానికి సీఎం చంద్రబాబు సూచించారు. అప్పుడే డిజిటల్ ఇండియా రూపుదిద్దుకుంటుందని లేఖలో చంద్రబాబు అభిప్రాయపడ్డారు. నల్లధనంపై ప్రధానికి లేఖ రాసిన ముఖ్యమంత్రుల్లో చంద్రబాబే మొదటివారు కావడం గమనార్హం