Posted [relativedate]
ఎప్పటినుంచో ఊరిస్తున్న క్యాబినెట్ హోదా టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి కి దాదాపు ఖాయమనే వార్తలు వస్తున్నాయి.అయినా ఆయనలో ఉత్సాహం పొంగిపొర్లడం లేదు.వచ్చిన అనుచరులే అడుగుతున్నా అయన తనకు వచ్చిన ఆఫర్ గురించి మాట్లాడ్డం లేదు.ఎందుకంటే ..సోమిరెడ్డి క్యాబినెట్ మంత్రి కావాలనుకుంటే ఆయనకి ఆ హోదా మాత్రం దక్కేలా శాసనమండలి ఛైర్మన్ గా చేయడానికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట.నిజంగా చంద్రబాబు ఆ పదవి ఇచ్చి ఉంటే సోమిరెడ్డి సంతోషపడేవారే గానీ లోపల జరిగిన విషయం చూఛాయగా తెలియడంతో అయన హర్ట్ అయినట్టు తెలుస్తోంది.ఇంతకీ ఆ లోగుట్టు ఏంటంటే …
వైసీపీ అధినేత జగన్ ని గట్టిగా డీకొడ్తున్న టీడీపీ లోని రెడ్డి నాయకుడు సోమిరెడ్డి.ఆయన్ను బద్నాం చేసేందుకు వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసిన అక్రమాస్తుల వ్యవహారం తిరిగితిరిగి వైసీపీ కే చుట్టుకుంది.పరిస్థితి గమనించిన బాబు …సోమిరెడ్డి ని క్యాబినెట్ లోకి తీసుకుని వైసీపీ బలంగా వున్న నెల్లూరు,రాయలసీమ జిల్లాల్లో తురుపు ముక్కలా వాడాలని భావించారు.కొన్ని సంకేతాలు వెలువడడంతో నెల్లూరు జిల్లా మంత్రి నారాయణ అలెర్ట్ అయ్యారంట.సోమిరెడ్డిని క్యాబినెట్ లోకి తీసుకోవద్దని …అదే హోదా లభించే మరో పదవి ఇవ్వాలని నారాయణ ఒత్తిడి మీదట శాసనమండలి ఛైర్మన్ ప్రతిపాదన ముందుకొచ్చిందట.ఆ పదవి తీసుకుంటే రాజకీయంగా చురుగ్గా మాట్లాడే అవకాశం కూడా ఉండదని సోమిరెడ్డి ఫీల్ అవుతున్నారట.ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి …నేను జగన్ మీద,వైసీపీ మీద యుద్ధం చేస్తానంటే నా నోటికి తాళం వేస్తారా అని ప్రశ్నించారట.ఈ వాదనకి బాబు కూడా కన్విన్స్ అయ్యారంట.అయితే ఇప్పుడు నారాయణ ని ఒప్పించడం కూడా ఆయనకి సమస్యగా మారిందంటున్నారు.ఏదేమైనా ఇద్దరు నేతలు మధ్య బాబు నలిగిపోతున్నారు.