మెగా హీరోతో ‘ప్రేమమ్’ డైరెక్టర్…

0
495

Posted [relativedate]

    chandu mondeti varun tej movie

‘కార్తీకేయ’ సినిమాతో దర్శకుడుగా పరిచయమయ్యాడు చందూ మొండేటి. తొలి చిత్రంతోనే మేటరున్న దర్శకుడిగా పేరు తెచ్చుకొన్నాడు. చైతూ ‘ప్రేమమ్’తో
చందూకి మరింత పేరొచ్చింది. ఆల్రెడీ హిటైన మళయాళ బ్లాక్ బస్టర్ ‘ప్రేమమ్’ని ఏ మాత్రం ఫీల్ మిస్ కాకుండా తెలుగులో రిమేక్ చేసిన విధానం ఆకట్టుకొంది. అందులో చైతూని చూపించిన విధానంపై అక్కినేని అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

‘ప్రేమమ్’తో చందూ మొండేటిని ఫాలో అయ్యే వారి సంఖ్య పెరిగిపోయింది. సీనియర్ హీరోలు వెంకీ, నాగ్ లు సైతం చందూ దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు
రెడీగా ఉన్నారు. అయితే, చందూ మాత్రం మెగా హీరో కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ కో ఓ కథని చెప్పి.. ఓకే
చేయించుకొన్నాడు చందూ. వరుణ్ బిజీ షెడ్యూలో ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ చిత్రం దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కనుంది.

ఇందులో వరుణ్ ని సూర్య ‘గజని’ రేంజ్ లో చూపించబోతున్నాడట. ఒక్క మాటలో చెప్పాలంటే మెగా ‘గజని’ అన్నమాట. మరి.. ఈ మెగా ‘గజని’ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.

Leave a Reply