చరణ్, అఖిల్… అదిరే కాంబో!

0
365
Charan, Akhil Combo Movie

Posted [relativedate]

Charan, Akhil Combo Movie

ఏంటి నిజమా.. మెగా హీరో.. అక్కినేని వారసుడు కలిసి మల్టీస్టారర్ చేస్తున్నారా.. డైరక్టర్ ఎవరు.. నిర్మాత ఎవరు.. ఇలాంటి ప్రశ్నలన్ని రావడం మాములే. క్రేజీ కాంబో ఏది జరుగుతుంది అన్న ఆడియెన్స్ ఎక్సయిట్మెంట్ అందరికి తెలిసిందే. అయితే చరణ్, అఖిల్ కలిసి చేసేది నిజమే అయినా అది మల్టీస్టారర్ గా కాదు. ఖైది నెంబర్ 150తో నిర్మాతగా మరో భాధ్యత తన మీద వేసుకున్న చెర్రి తన ప్రొడక్షన్లో వరుస సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు. ఖైది రిలీజ్ అవగానే ఆ తర్వాత వెంటనే మరో మూవీ కూడా స్టార్ట్ చేస్తాడట.

ఇక తన నిర్మాణంలో అఖిల్ తో ఓ సినిమా తీస్తానని అంటున్నాడు చరణ్. అఖిల్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన అఖిల్ తన స్టామినా ఏంటో చూపించాడు. ప్రస్తుతం సెకండ్ మూవీ విక్రం కె కుమార్ తో కమిట్ అవ్వగా తన థర్డ్ మూవీ కోసం కథలు వింటున్నాడట. డైరక్టర్ ఎవరన్నది కన్ఫాం కాలేదు కాని అఖిల్ మూవీ ప్రొడ్యూసర్ మాత్రం చరణ్ అని ఫిక్స్ అవ్వొచ్చు. చిరు, నాగార్జునల మధ్య ఉన్న సాన్నిహిత్యం చరణ్, అఖిల్ అలవరుచుకున్నారు.

మరి చరణ్, అఖిల్ కాంబో అదేనండి చెర్రి నిర్మాతగా అఖిల్ చేసే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ఆ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారో చూడాలి. ప్రస్తుతం చెర్రి ఖైది నెంబర్ 150 నిర్మాతగా చేస్తూనే తను నటిస్తున్న ధ్రువ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు.

Leave a Reply