మెగా క్యాంపు సెట్ రైట్ …చరణ్,అర్జున్ మల్టీస్టారర్?

 Posted April 3, 2017

charan arjun multistarrer
మెగా క్యాంపు లో విబేధాల గురించి కొన్నాళ్లుగా సోషల్ మీడియా లో వార్తలు గుప్పుమంటున్నాయి.ఒకప్పుడు ఫ్యాన్స్ కూడా ఒకటే మాట మీద వుండేవాళ్ళు.మంది ఎక్కువైన కొద్దీ మజ్జిగ పలచన అయినట్టు ఒక్కోరు ఒక్కో హీరో వెనుక పడడంతో ఆ ఐక్యతకు బీటలు వారినట్టు అనిపిస్తోంది.మెగా ఫ్యాన్స్ ని బాగా ఇబ్బంది పెడుతున్న వార్త పవన్,చరణ్ లతో బన్నీకి పడటంలేదన్నది.అయితే ఈ వార్తలు అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మెగా ఫ్యాన్స్ లో ఎక్కడలేని హుషారు తెప్పించే వార్త ఒకటి బయటికి వచ్చింది.అదే చరణ్,బన్నీ మల్టీస్టారర్.ఇలాంటి పుకార్లు చాలా వచ్చాయని మీకు అనిపించొచ్చు .కానీ ఈసారి అలా కాదనడానికి ఓ బలమైన సాక్ష్యం కళ్ల ముందు కనిపిస్తోంది.

గీతా ఆర్ట్స్ సంస్థ “చరణ్ అర్జున్” అనే టైటిల్ రిజిస్టర్ చేసిన వార్త ఫిలిం నగర్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది.ఇదేమీ ఆషామాషీ వ్యవహారం కాదని టైటిల్ చెప్పకనే చెబుతోంది.చరణ్,బన్నీ కాంబినేషన్ లో మల్టీస్టారర్ కోసం రహస్యంగా గీతా సంస్థ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.అయితే ఆ విషయం బయటికి రాకుండా ఇన్నాళ్లు మైంటైన్ చేసింది.ఇదిగో ఇప్పుడు ఇలా టైటిల్ రిజిస్ట్రేషన్ తో ఆ గుట్టు బయటపడింది.ఏదేమైనా ఈ కాంబినేషన్ వర్క్ అవుట్ అయితే కనుక మెగా క్యాంపు సెట్ రైట్ అయినట్టే.

SHARE