ఆ విషయంలో ఎన్టీఆర్ ను క్రాస్ చేసిన చరణ్..!

0
409
Charan Cross Ntr With His Make Over

Posted [relativedate]

Charan Cross Ntr With His Make Overటాలీవుడ్లో మారిన ఆడియెన్స్ ధోరణి ఆధారంగా స్టార్ హీరోలు కూడా ఎప్పటిలానే రొటీన్ కథలే చేస్తే వాటి రిజల్ట్ ఎలా ఉంటుందో రుచి చూసివ వారే. అందుకే మేకోవర్ తో సర్ ప్రైజ్ ఇస్తున్నారు. జనతా గ్యారేజ్ తో తారక్ తనలోని మరో కొత్త యాంగిల్ ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఓ విధంగా ఇన్నాళ్లు క్లాస్, ఓవర్సీస్ ప్రేక్షకులు దూరంగా ఉన్న తారక్ తను తీసిన నాన్నకు ప్రేమతో సినిమాతో దగ్గరయ్యాడు.

ఇక ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న ధ్రువ గురించి మాట్లాడుకుంటే. రాం చరణ్ లోని మరో యాంగిల్ చూపించిందని చెప్పాలి. ప్రత్యేకంగా కొన్ని ఎమోషన్స్ లో కాస్త ఎబ్బెట్టుగా అనిపించే చెర్రి ఈ సినిమాలో సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో వారెవా అనిపించాడు. ఇక చరణ్ తర్వాత సినిమా సుకుమార్ తో ఫిక్స్ అయ్యాడు. సో ఈ మేకోవర్ మరింత స్టారంగ్ అయ్యే అవకాశం ఉంది. రొటీన్ సినిమాలకు భిన్నంగా వెళ్లే సుక్కు చెర్రిని సరికొత్తగా చూపిస్తాడని అంటున్నారు. అదే కనుక జరిగితే మేకోవర్ విషయంలో ఎన్.టి.ఆర్ ను చరణ్ క్రాస్ చేసినట్టే అని చెప్పుకోవచ్చు.

Leave a Reply