పవన్ ని చరణ్ అంతమాటనేశాడే..ప్చ్!

0
354
charan dissapointing words on pawan kalyan

Posted [relativedate]

charan dissapointing words on pawan kalyan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల బ్యానర్ మీద తీస్తున్న ఖైదీ నెంబర్ 150 అనుకున్నదానికంటే ఒక రోజు ముందుగా జనవరి 11 న ప్రేక్షకులని పలకరించనుంది.ఈ నిర్ణయం వెనుక తండ్రి చిరు సలహా ఉన్నట్టు చరణ్ చెప్పారు.గౌతమీపుత్ర శాతకర్ణి విడుదల కూడా 12 కావడంతో ఒకే రోజు రెండు పెద్ద సినిమాల విడుదల పరిశ్రమకి మంచిది కాదని చిరు చెప్పడంతో ప్లాన్ మార్చుకున్నట్టు ఫాన్స్ తో జరిపిన లైవ్ చిట్ చాట్ లో చరణ్ తెలిపారు. ఒకప్పుడు తనతో మాటల యుద్ధం చేసిన దాసరి నారాయణరావు సైతం ఈ నెల 7 న జరిగే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వస్తున్నట్టు చరణ్ వివరించారు.ఆయనతో పాటు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కూడా రానున్నట్టు తెలిపారు.శాతకర్ణి టీం విజయం సాధించాలని రామ్ చరణ్ శుభాకాంక్షలు చెప్పారు.

అన్ని విషయాలపై ఫాన్స్ తో ఏ మొహమాటం లేకుండా పరిణితితో మాట్లాడిన చరణ్ …పవన్ విషయం వచ్చేసరికి భిన్నంగా స్పందించారు. పవర్ స్టార్ కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వస్తారా అని ఓ అభిమాని అడిగినపుడు ఆయనకి ఇవాళే ఇన్విటేషన్ అందిస్తున్నాం.అంతవరకే మన పని.రావాలో ..వద్దో ఆయనే నిర్ణయించుకుంటారు.పిలుచుకుని తీసుకురావడానికి ఆయనేమైనా చిన్న పిల్లాడా? ఈ స్టైల్ లో చరణ్ మాట్లాడ్డం వెనుక మెగా ఫామిలీ ఆవేదన కనిపిస్తోంది.బయట ఫంక్షన్ లకి బాగానే వెళ్తున్న పవన్ అన్నయ్య వున్న చోటికి రాకపోవడం …ప్రతి ఫంక్షన్ లో ఫాన్స్ గొడవ చేయడం చూసిచూసి విసిగిపోయి చరణ్ అలా తన బాధ వెళ్లగక్కి ఉంటాడు.

Leave a Reply