శాతకర్ణి దర్శకుడితో చరణ్..

0
247
charan in krish direction

Posted [relativedate]

charan in krish direction
గౌతమి పుత్ర శాతకర్ణి విజయంతో స్టార్ హీరోలంతా దర్శకుడు క్రిష్ తో ఓ సినిమా అయినా చెయ్యాలని ఆశ పడుతున్నారు. ఇంతకుముందు వినిపించి ఆగిపోయిన కాంబినేషన్లు,కధలు మళ్లీ పిక్చర్ లోకి వస్తున్నాయి.తాజాగా ఫిలిం నగర్ లో వినిపిస్తున్న ఓ మాట ఇది.క్రిష్,చరణ్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోందట. కంచె తర్వాత క్రిష్,వరుణ్ చేస్తారనుకున్న రాయబారి కధనే ఇప్పుడు కొన్ని మార్పులు చేర్పులతో చరణ్ చేయబోతున్నాడట.ఈ సినిమాలో విశేషం ఏమిటంటే హీరో బాండ్ క్యారెక్టర్ లో కనిపించడం.
జేమ్స్ బాండ్ సినిమాల తరహాలో స్పై థ్రిల్లర్ కథని చరణ్ కి క్రిష్ వినిపించగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.ఇంతకు ముందు తెలుగులో ఈ తరహా కధలు ఇద్దరు హీరోలు మాత్రమే చేశారు.అందులో ఒకరు సూపర్ స్టార్ కృష్ణ అయితే ..ఇంకోరు మెగా స్టార్ చిరంజీవి. ఈ జానర్ లో ఈ మధ్య సినిమాలు రావడమే గగనంగా మారాయి.అందుకే క్రిష్ కథ చెప్పగానే రెండో మాట లేకుండా చరణ్ ఓకే అన్నారంట. అయితే ఈ సినిమా పట్టాలెక్కడానికి టైం పడుతుందట.ఈ ఏడాది చివర లేక వచ్చే ఏడాది మొదట్లో చరణ్,క్రిష్ ల రాయబారి జర్నీ మొదలవుతుంది.

Leave a Reply