చరణ్ సినిమా ఛాన్స్ తెచ్చిపెట్టేనా..!

0
307
Charan Movie Surender Reddy Lucky For Ntr

Posted [relativedate]

Charan Movie Surender Reddy Lucky For Ntrమెగా పవర్ స్టార్ రాం చరణ్ నటించిన ధ్రువ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ధ్రువ సక్సెస్ లో చెర్రితో పాటు డైరక్టర్ సురేందర్ రెడ్ది పాత్ర కూడా చాలా కీలకం అని చెప్పొచ్చు. రీమేక్ సినిమా అయినా తన మార్క్ డైరక్షన్ తో సురేందర్ రెడ్డి తన ప్రతిభ కనబరిచాడు. అందుకే ఇన్నాళ్లు కన్ ఫ్యూజన్ లో ఉన్న సినిమాల విషయంలో ఓ క్లారిటీ వచ్చింది.

రేసుగుర్రం హిట్ తర్వాత కిక్-2 ఫ్లాప్ అందుకున్న సురేందర్ రెడ్డికి రాం చరణ్ ఛాన్స్ ఇవ్వడంతో చెర్రి రిస్క్ చేస్తున్నాడని అన్నారు. కాని సినిమా రిజల్ట్ చూశాక చరణ్ డెశిషన్ కరెక్ట్ అని అనక తప్పలేదు. అయితే ఇదే క్రమంలో సురేందర్ రెడ్డి తన ఫేవరేట్ హీరో యంగ్ టైగర్ తో మరో సినిమా చేయాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. అశోక్, ఊసరవల్లి సినిమాలతో ఇద్దరి కాంబినేషన్ మంచి క్రేజ్ సంపాదించడంతో ఈసారి అంతకన్నా సూపర్ హిట్ కొట్టేలా ప్లాన్ చేశారు. అయితే కిక్-2 ఫ్లాప్ తో కాస్త వెనుకపడ్డ సురేందర్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చేందుకు తారక్ ఆలోచనలో పడ్డాడట. ఇక చెర్రితో ధ్రువ హిట్ అయితే అప్పుడు ఆలోచిద్దాం అనేశాడట.

ఈరోజు రిలీజ్ అయిన ధ్రువ హిట్ టాక్ తెచ్చుకుంది. మరి తారక్ అవకాశం ఇస్తాడా లేదా అన్నది చూడాలి. ఓ పక్క తారక్ ఇప్పటికే బాబి డైరక్షన్లో మూవీకి సిద్ధమయ్యాడని అంటున్నారు. సురేందర్ రెడ్డితో తారక్ సినిమా ఉందా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది.

Leave a Reply