చరణ్ వారిపై అసూయ పెంచుకున్నాడట..!

Posted December 19, 2016

Charan Shocking Comments About Sharwanand, Nani

మెగా పవర్ స్టార్ రాం చరణ్ టాలీవుడ్ లో ఇద్దరు హీరోలపై అసూయ పెంచుకున్నాడట. చరణ్ ఏంటి జలస్ ఫీలవడం అది కూడా హీరోల విషయంలో అని కన్ ఫ్యూజ్ అవ్వొచ్చు, ఇంతకీ అసలు విషయం ఏంటంటే ప్రస్తుతం ధ్రువ హిట్ జోష్ లో ఉన్న చెర్రి శర్వానంద్, నానిల మీద కొద్దిపాటి జలస్ ఉంది అంటున్నాడు. అసలు వారి మీద చెర్రి ఎందుకు అసూయ పడుతున్నాడు అంటే వారు చేసే సినిమాలే అని తెలుస్తుంది. స్టార్ హీరో మెగాస్టార్ తనయుడిగా తనకంటూ కొన్ని పరిమితులు ఉంటాయి స్టార్ హీరో కొడుకు కచ్చితంగా స్టార్ అవ్వాలి అలాంటి టైంలో ప్రయోగాలు చేయడం కుదరదు.

అయితే టాలీవుడ్ యువ హీరోల్లో శర్వానంద్, నానిలు మాత్రం ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా వెరైటీ సబ్జెక్ట్స్ తో సినిమాలు చేస్తుంటారు. అవే ఆడియెన్స్ కు వారిని దగ్గర చేశాయి. శర్వానంద్ సినిమా సినిమాకు కొత్త ప్రయోగాలను చేస్తూ మంచి క్రేజ్ సంపాదించాడు ఇక నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఈ ఇద్దరిని చూస్తే తనకు అసూయ కలుగుతుంది అంటున్నాడు చెర్రి. ఓ విధంగా స్టార్ హీరో అయ్యుండి శర్వానంద్, నానిల గురించి ఇంత ఓపెన్ గా మాట్లాడటం చెర్రికే చెల్లిందని చెప్పాలి.

ఇక ఇమేజ్ తో పోలిస్తే చెర్రి తర్వాతే శర్వానంద్ కాని, నాని కాని ఉంటారు. అయితే ఆర్టిస్ట్ గా తమకు తాము సాటిస్ఫై అయ్యేలా సినిమాలు చేస్తున్నారంటూ చెర్రి ఆ హీరోలిద్దరిపై తన అభిప్రాయం వ్యక్తపరిచాడు. ఈ న్యూస్ తెలిస్తే కచ్చితంగా శర్వా, నానిల మీద మరింత భాధ్యత పెరిగే అవకాశం తప్పకుండా ఉందని చెప్పొచ్చు.

SHARE