చరణ్ సుక్కు వెరైటీ టైటిల్..!

Posted [relativedate]

rc1816మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ధ్రువ తర్వత క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ తో సినిమాకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఇదో పల్లెటూరి ప్రేమకథ అని ముందునుండి చెప్పుకొచ్చిన చిత్రయూనిట్ ఇప్పుడు ఈ సినిమా టైటిల్ గా ఓ వెరైటీ టైటిల్ ను ప్రచారంలో తెచ్చారు. ‘ఫేస్ బుక్ లైవ్ చాట్ @ 8.18 pm’ ఇది చరణ్ సుక్కు సినిమాకు అనుకుంటున్న టైటిల్ అట.

సినిమా కథేమో పల్లెటూరి కథ అంటూ.. పిరియాడికల్ డ్రామా అంటూ ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ లో టైటిల్ అది కూడా ‘ఫేస్ బుక్ లైవ్ చాట్ ఎట్ 8.18 pm’ అని పెట్టడం ఏంటని అందరు ఆశ్చర్య పడుతున్నారు. అయితే ఇదే సినిమాకు ఇంతకుముందు కూడా ఫార్ములా ఎక్స్ అని టైటిల్ ప్రచారం జరిగింది. మరి అసలు టైటిల్ ఏంటి అనేది సినిమాకు సంబందించిన వారు ఎనౌన్స్ చేస్తే తప్ప నమ్మేలా లేదు. చరణ్ సుక్కు సినిమా కన్ఫాం అని తెలిసినా ఆ సినిమా ముహుర్తం ఎప్పుడు అన్నది ఇంకా వెళ్లడించలేదు. మరి సెట్స్ మీదకు వెళ్లని సినిమా గురించి ఈ టైటిల్ గోల అవసరమా చెప్పండి.

Leave a Reply