వాట్ ఏ చేంజ్ చెర్రి..!

0
350
Charan Surprise Change In Dhruva

Posted [relativedate]

Charan Surprise Change In Dhruvaమెగా పవర్ స్టార్ రాం చరణ్ నటించిన ధ్రువ సినిమా నిన్న రిలీజ్ అయ్యింది. అన్ని చోట్ల ప్లాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాలో చరణ్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ధ్రువకు ముందు చరణ్ వేరే ధ్రువ తర్వాత చరణ్ వేరే అన్న రీతిన తన పర్ఫార్మెన్స్ ఉంది. క్యారక్టర్ లో ఉన్న ఇంటెన్సిటీని తన అభినయంతో అదరగొట్టాడు. సినిమా మొత్తం సీరియస్ నోట్ లో వెళ్తున్నా ఆడియెన్స్ కూడా దాన్ని ఫాలో అయ్యేలా చేశారు. ఆల్రెడీ హిట్ అయిన సినిమా కాబట్టి ఇక్కడ అదే రిజల్ట్ అని చెప్పుకోలేం. చెర్రి యాక్టింగ్ సురేందర్ రెడ్డి డైరక్షన్ సినిమాను ఈ రేంజ్ లో వచ్చేలా చేశాయి.

సినిమా కోసం ప్రత్యేకమైన డైట్ తీసుకున్న రాం చరణ్ సిక్స్ ప్యాక్ తో వారెవా అనిపించాడు. ఇక తనదైన స్టైల్ లో డ్యాన్స్ అంతకుమించి సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో కనబరిచాడు. మెగాస్టార్ వారసుడిగా తన మెగా పవర్ ను చూపించిన చెర్రి ఈ సినిమాలో తన యాక్టింగ్ టాలెంట్ చూపించాడని చెప్పొచ్చు. సినిమా మొత్తం మీద రెండు మూడు సీన్స్ లో ప్రత్యేకంగా చెర్రి నటనకు ఫ్యాన్స్ మాత్రమే కాదు సిని అభిమానులు కూడా సూపర్ అనేస్తున్నారు.

సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా అల్లు అరవింద్ ఎన్వి ప్రసాద్ నిర్మించారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా హిప్ హాప్ తమిజ మ్యూజిక్ అందించారు.

Leave a Reply