Posted [relativedate]
ప్రశాంత్…. జీన్స్ మూవీ తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచతమైన హీరో. ప్రస్తుతం ఈయన వైవాహిక జీవితం గురించి కోలీవుడ్ లో కోడై కూస్తుంది.ఇటీవల ప్రశాంత్ అతని భార్యతో విడాకులు కావాలని కోర్ట్ ని ఆశ్రయించిన విషయం తెలిసిందే . ఇప్పుడు తాజాగా కోర్టు నుంచి విడాకులు కూడా అందుకున్నాడు ప్రశాంత్. విడాకులు తీసుకున్న అనంతరం ప్రశాంత్ తన భార్య గృహలక్ష్మి గురించి, గృహలక్ష్మి తో విడిపోవటానికి కారణం వివరించాడు.
‘గృహలక్ష్మికి నాతో పెళ్ళికాక ముందే వివాహమైందని.. నాకు ఆ విషయం చెప్పకుండా దాచి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుందని చెప్పాడు. ఈ విషయం నాకు పెళ్ళైన తర్వాతే తెలిసింది అని,ఒకరోజు ఒక గుర్తు తెలియని వ్యక్తి నాకు ఫోన్ చేసి నీ భార్య గృహలక్ష్మి కి ఎప్పుడో పెళ్లి అయ్యింది, తను నిన్ను మోసం చేసింది అని చెప్పాడు. అప్పుడు ఆ మాటలు నన్ను ఎంతో చిత్రహింసకు గురిచేసాయని చెప్పాడు.మొదటిసారి ఆ విషయం నాకు మింగుడు పడలేదు,నాకు తన గురించి తెలుసుకోవాలి అని అనిపించి ఎంతో సెర్చ్ చేశాను అని,అది నిజమని తెలిసి చాలా భాద పడ్డానని చెప్పాడు..
సరే సర్దుకుపోదామని అనుకుంటే పెళ్లి తర్వాత కూడా ఆమె ప్రవర్తన మారలేదు, పెళ్లి తర్వాత కూడా అతనితో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను అని.ఇంకా ఆమెను భరించడం నావల్ల కాకపోవడంతో చెన్నై ఫ్యామిలీ కోర్టు నుంచి విడాకులు తీసుకున్నాను’ అని చెప్పాడు ప్రశాంత్. అప్పట్లో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానన్న ఈ హీరో.. మనో వేదనతో నరకం చూశానన్నాడు. ఇప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉందని చెప్పాడు.. అయితే.. తాను ఎలాంటి మోసం చేయలేదంటూ ఈమె హైకోర్టును ఆశ్రయించినా.. అక్కడ కూడా ప్రశాంత్ వాదననే కోర్టు సమర్ధించింది.
ఆరేళ్ల తన వైవాహిక జీవితంలో నరకం అనుభవించానన్న ప్రశాంత్.. ఇంకా కుమారుడి సమస్య తీరకపోవడం బాధాకరంగా ఉందని అన్నాడు. మైనర్ బాలుడు కావడంతో.. తల్లి దగ్గరే ఉండాలని కోర్టు చెబుతుండడంతో.. చట్టప్రకారమే నడుచుకోనున్నట్లు తెలిపాడు.