శర్వానంద్ పై డైరెక్టర్ ఫైర్…

టాలీవుడ్ లో శర్వానంద్ కు మంచి పేరుంది.సాత్వికుడు ,సౌమ్యుడు తనపనేదో తాను చేసుకు పోతుంటాడు.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి మంచి మిత్రుడు .స్నేహానికి అధిక ప్రాధాన్యతనిస్తాడు.చిన్న చిన్న క్యారెక్టర్లతో ప్రస్థానం మొదలెట్టాడు.సోలో హీరోగా ఎదిగాడు.యువసేన,అందరి బంధువయా,ప్రస్థానం లాంటి విభిన్నమైన సినిమాల్లో నటించాడు.ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు శర్వానంద్.

ఇలాంటి వ్యక్తి తన సినిమా పై తానే నెగిటివ్ ప్రచారం చేస్తున్నాడట .ఎవరైనా అలా చేస్తారా ?ఔను చేశాడంటున్నాడు ఒక తమిళ డైరెక్టర్ .ఆయనగారి పేరు చేరన్. తమిళ్ లో హిట్ చిత్రాల డైరెక్టర్ చేరన్ ఆమధ్య శర్వానంద్ తో ఓ సినిమా తీశాడు.అది తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయాలనుకొన్నారు.కొన్ని కారణాల వల్ల తమిళంలో డైరెక్ట్ గా సీడీలు రిలీజ్ చేశారు. ఆ మూవీ తెలుగు లో’రాజాధి రాజా’ గా రిలీజ్ అయింది.దీనికి శర్వానంద్ ప్రమోట్ చెయ్యలేదు.ఇంకా నెగిటివ్ ప్రచారం చేస్తున్నాడని డైరెక్టర్ చేరన్ గారి ఆరోపణ.

చెన్నై లో ప్రెస్ మీట్ పెట్టిమరీ శర్వానంద్ పై ఆరోపణలు చేశారు ఈ డైరెక్టర్.హిట్ లేని సమయం లో పిలిచి సినిమాయిచ్చాను.అయినా బాగా ఆడుతున్న చిత్రం పై ఇలా నెగిటివ్ ప్రచారం చేయటం సంస్కారం కాదని వ్యాఖ్యానించారు సదరు డైరెక్టర్. ఏది నిజమో …

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here