చెర్రీ మూవీలో మరో హీరో..!!

0
515
cherry multistarrer with vibhav

Posted [relativedate]

cherry multistarrer with vibhavవరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న రామ్ చరణ్ తేజ్ కి హీరోగా ధృవ సినిమా, నిర్మాతగా ఖైదీ నెం. 150 సినిమాలు  కొత్త ఉత్తేజాన్ని అందిచాయి. ఈ జోష్ తో చెర్రీ  ప్రస్తుతం ఓ పల్లెటూరు ప్రేమకథ చిత్రంలో నటిస్తున్నాడు. చెర్రీ సరసన సమంత జతకట్టనున్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించనున్నాడు.

కాగా ఈ మూవీ లో మరో స్టార్ డైరెక్టర్ కొడుకు కూడా ఓ కీలక  రోల్ లో కనిపించబోతున్నాడని సమాచారం. మెగాస్టార్ చిరంజీవికి ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ కోదండ రామిరెడ్డి కొడుకు వైభవ్ ఈ మూవీ లో కనిపించబోతున్నాడట. గొడవ , కాస్కో , యాక్షన్ ౩డి చిత్రాల్లో హీరో గా తెలుగు ఆడియన్స్ ను అలరించాడు వైభవ్.  ప్రస్తుతం తమిళం లో వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీ గా ఉన్నాడు. కాగా చాలా  రోజుల నుండి తెలుగులో ఏదయినా మంచి రోల్ వస్తే చేయడానికి రెడీగా ఉన్న వైభవ్ చెర్రీ మూవీ అయితే బాగుంటుందని భావించాడట. పైగా  సుకుమార్ చెప్పిన కథ కూడా నచ్చడంతో వెంటనే వైభవ్ ఓకే చెప్పినట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. తెలుగులో ఇప్పటివరకు సరైన హిట్ లేక వెనకబడ్డ వైభవ్ మరి చెర్రీ సినిమాతోనైనా తన వైభవాన్ని ప్రారంభిస్తాడేమో చూడాలి.

 

 

Leave a Reply