వావ్..  అనిపిస్తున్న చెర్రీ న్యూ లుక్!!

0
495
cherry new look super

Posted [relativedate]

cherry new look superమెగాస్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్… హీరోగానే కాక నిర్మాతగా కూడా మంచి స్ట్రాటజీని ఫాలో అవుతానని  నిరూపించుకున్నాడు. కాగా ధృవ సక్సెస్ తర్వాత చెర్రీ… సుకుమార్ దర్శకత్వంలో నటించనున్నాడన్న విషయం తెలిసిందే. పక్కా పల్లెటూరి వాతావరణంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఎంతో గ్రాండ్ గా ఈ రోజు ఓపెనింగ్ జరిగిన ఈ సినిమాలో చెర్రీకి సంబంధించిన ప్రీ లుక్ ను విడుదల చేశాడు దర్శకుడు.  

ఇందులో చెర్రీ ఓ పల్లెటూళ్లో.. రెండు బిందెలున్న  కావడిని మోస్తున్నట్లుగా దర్శనమిస్తాడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని సుకుమార్ పీరియాడికల్ మూవీగా తెరకెక్కిస్తున్నాడని సమాచారం. ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. కాగా చాలా సింపుల్ గా ఉన్న చెర్రీ లుక్ ని అభిమానులు తెగ షేర్ చేసేసుకుంటున్నారు. 

Leave a Reply