జీతంలో కెసిఆర్ టాప్..బాబు థర్డ్

chief ministers salaries

సీఎం కెసిఆర్ జీతం చూస్తే కళ్ళు తిరాగాల్సిందే…

భారత దేశంలో అన్ని రాష్ట్రాల ముఖమంత్రుల్లోనూ సిఎం కెసిఆర్ జీతమే టాప్. ఇంతకి ఆయన జీతం ఎంతో తెలుసా అక్షరాల నెలకు రూ.4,21,000. అయితే ఆర్థికంగా ఉన్నత రాష్త్రం కావడంతో ఆ మాత్రం తీసుకుంటే తప్పెంటని వారు అంటున్నారు.

అంతే కాకుండా ఈ రాష్ర్ట ఎమ్మేల్యేలకు కూడా తక్కువేం చేయలేదు. వారికీ కూడా నెలకు రూ.2,50,000 ఇస్తూ దేశంలోనే అందరి ఎమ్మేల్యేల కంటే టాప్ లో వారిని నిలబెట్టారు మన కెసిఆర్.

ఇక రెండు రాష్ట్రాల విభజనతో ఖజానా కొల్లభోయిందని చెప్పే ఏపి
సీఎం చంద్రబాబు కూడా తక్కువేమి తీసుకోవట్లేదు.
దేశంలో అధిక మొత్తంలో వేతనాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రుల జాబితాలో ఆయన మూడో వారు.

మొదటి స్థానం కెసిఆర్ ఆక్రమించగా, రెండో స్థానం.. ఉతరాఖండ్ సీఎం నెలకు రూ.2,50,000 కైవసం చేసుకున్నాడు.

మూడవ స్థానంలో చంద్రబాబు రూ.2,40,000 తీసుకుంటున్నారు. అదే విధంగా ఎపి ఎమ్మెల్యేలు కూడా నెలకు రూ.1,25,000 అందుకుంటున్నారు. ఇక పోతే తమిళనాడు పాలిస్తున్న జయలలిత ఒక్క రూపాయి తీసుకుంటుండగా పశ్చిమ బెంగాల్ దీదీ అది కూడా తీసుకోవడం లేదు. ఈ రెండు రాష్ట్రాల ఎమ్మేల్యేలు కూడా జీతాలు తక్కువగా తీసుకుంటూ ఆశ్చర్యం కలిగిస్తున్నారు.

ఇక ఇప్పుడు పలు రాష్ట్రాల సీఎం లు ఎమ్మేల్యేల నెల జీతాలు

తెలంగాణ
ముఖ్యమంత్రి: రూ.4,21,000
ఎమ్మెల్యేలు: రూ.2,50,000

ఉత్తరాఖండ్
ముఖ్యమంత్రి: రూ. 2,50,000
ఎమ్మెల్యేలు: రూ. 1,60,000

ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి: రూ.2,40,000
ఎమ్మెల్యేలు: రూ.1,25,000

మధ్యప్రదేశ్
ముఖ్యమంత్రి: రూ. 2,00,000
ఎమ్మెల్యేలు: రూ.1,10,000

ఉత్తరాఖండ్
ముఖ్యమంత్రి: రూ. 2,50,000
ఎమ్మెల్యేలు: రూ. 1,60,000

మహారాష్ట్ర
ముఖ్యమంత్రి : రూ.2,25,000
మంత్రులు: రూ.2,05,000
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు: రూ.1,70,000

ఢిల్లీ
ముఖ్యమంత్రి: రూ.1,20,000
మంత్రులు: రూ.1,20,000
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు : రూ.88,000
మంత్రుల వేతనాలు రూ.3,20,000లకు, ఎమ్మెల్యేల వేతనాలు రూ.2,10,000లకు పెంచాలని ఢిల్లీ అసెంబ్లీ బిల్లు పాస్ చేసింది.

తమిళనాడు
ముఖ్యమంత్రి : రూ.1
ఎమ్మెల్యేలు: రూ.55,000

పశ్చిమబెంగాల్
ముఖ్యమంత్రి: రూ.0
ఎమ్మెల్యేలు: రూ.42,000 –

మొత్తానికి అత్యధిక జీతం తీసుకుంటున్న జాబితాలో సీఎం కెసిఆర్ రికార్డు కేక్కితే .బెంగాల్ సీఎం దీదీ మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సీఎం గా పనిచేస్తూ తన జీతాన్ని కూడా రాష్ర అభివృద్ధికి వెచ్చిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

 కె.భాస్కర్ రెడ్డి

SHARE