తిరుమలేశుడి ఆస్తి కోసం చిలుకూరు పూజారి దావా..

 Posted October 18, 2016

chilkur balaji temple pujari soundara rajan
టీటీడీ ఆదాయంలో తెలంగాణ వాటా తేల్చండని చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి సౌందర రాజన్ హైకోర్టు ని ఆశ్రయించారు.రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ ఆదాయం కూడా టీటీడీ లో ఉన్నందున ..ఓ వెయ్యి కోట్ల రూపాయలు ఆ రాష్ట్రానికి ఇప్పించాలని అయన కోర్టుకి విన్నవించారు.సౌందర రాజన్ పిటీషన్ స్వీకరించిన హైకోర్టు ఏపీ,తెలంగాణ ప్రభుత్వాలకి నోటీసులు జారీ చేసింది.మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాల్ని ఆదేశించింది. తెలంగాణ వచ్చినందుకు శ్రీవారి మొక్కు చెల్లించడానికి కెసిఆర్ సర్కార్ సిద్ధమవుతున్న తరుణంలో ఈ పిటీషన్ దాఖలు కావడం చర్చనీయాంశం అయింది.10 షెడ్యూల్ ఆస్తుల వివాదాన్ని పరిష్కరించడానికి కేంద్రం ఇటీవలే చొరవ తీసుకుంది.తాజా పరిణామం మిగిలిన అంశాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

SHARE