మోడీ పై చైనా మీడియా కన్ను ..!

Posted November 14, 2016

china media global times comment on modi
భారత్‌ లో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైన చర్యగా చైనా మీడియా వర్ణించింది. నల్లధనం నియంత్రణకు. అవినీతికి వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుందని చైనా జాతీయ ఆంగ్ల దినపత్రిక ’గ్లోబల్‌ టైమ్స్‌’ వ్యాఖ్యానించింది. డబ్బుతోనే కాకుండా బంగారం, రియల్‌ ఎస్టేట్‌, విదేశీ ఆస్తులతోనూ చీకటి ఒప్పందాలు జరుగుతున్న విషయాన్నీ గుర్తించి అరికట్టాలనే అభిప్రాయం వ్యక్తం చేసింది .

పెద్ద నోట్లను రద్దు చేయడం ఒక్కటే కాకుండా , వ్యవస్థలను సంస్కరించాల్సిన అవసరం ఉందని సలహా కోసం బీజింగ్‌ వైపు చూడాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. అవినీతి నిర్మూలనకు చైనా అనుసరిస్తున్న విధానాలు బాగా ఉపకరిస్తాయని ఉచిత సలహా ఒకటి ఇచ్చింది కూడా ..

మోదీ సర్కారు తిరుగులేని నిర్ణయం తీసుకుందని కామెంటేటర్‌ అయి జున్‌ వ్యాఖ్యానించారు. అక్రమంగా జరుగుతున్న వ్యాపారమంతా ఎక్కువగా డబ్బుతోనే జరుగుతోందన్న విషయాన్ని అందరూ గమనించాలన్నారు. అవినీతిపై పోరును మోదీ ఉధృతం చేయాల్సిన ఉందని అభిప్రాయపడ్డారు. మోదీ బాగా పనిచేస్తున్నారని పొగిడారు కూడా..

SHARE