ఏపీ ఖాకీ ప్రధాన కేంద్రం లక్షచదరపు అడుగుల్లో..

  china rajappa open ap dgp building amaravathi
ఆంధ్రప్రదేశ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ శంఖుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది.మంగళగిరి apsp 6 వ బెటాలియన్ లో డీజీపీ కార్యాలయానికి ఉపముఖ్యమంత్రి,హోమ్ శాఖా మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు.మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు ,రావెల కిషోర్ బాబు ,కామినేని శ్రీనివాస్ తో పాటు డీజీపీ సాంబశివరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సచివాలయానికి దగ్గరగా ఉండేలా డీజీపీ కార్యాలయ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్టు ఉపముఖ్యమంత్రి చెప్పారు.అమరావతి కి భద్రతాపరంగా అన్ని చర్యలు త్వరితంగా తీసుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు అయన వివరించారు.జి+5 గా 20 కోట్ల వ్యయంతో దాదాపు లక్ష చదరపు  అడుగుల విస్తీర్ణంతో డీజీపీ కార్యాలయం నిర్మిస్తున్నట్టు రాజప్ప తెలిపారు.జనవరి నాటికి నిర్మాణ పనులు పూర్తి చేస్తామన్నారు.ఇదే ప్రాంగణంలో హోమ్ శాఖకి సంబంధించిన ఇతర విభాగాల భవనాలు కూడా నిర్మిస్తామని అయన చెప్పారు.

SHARE