దీప భ‌ర్త వెనుక చిన్న‌మ్మ వ‌ర్గం?

Posted March 20, 2017

chinamma back of deepa's husband
జ‌య మేన‌కోడ‌లు దీపా జ‌య‌కుమార్ కొత్త రాజ‌కీయ పార్టీ పెట్టారు. ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగ‌బోతున్నారు. ఈ మేర‌కు కోడిపుంజు గుర్తు కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈలోపే నియోజ‌క‌వ‌ర్గంలోనూ అప్పుడే ప‌ర్య‌టిస్తూ.. జ‌నాన్ని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కానీ ఇంత‌లోపే దీప‌కు ఇంటిపోరు మొద‌లైంది. పోరు మొద‌లవ్వ‌డ‌మే కాదు ఏకంగా ఆమె భ‌ర్త కొత్త పార్టీ పెడ‌తానంటూ ప్ర‌క‌టించారు.

దీప భ‌ర్త కొన్నిరోజులుగా ఆమె తీరుపై అసంతృప్తితో ఉన్నారు. దీప పెట్టిన పార్టీలో ఆయ‌న‌కు ప్రాధాన్యం ఇవ్వ‌లేద‌ని ఆయ‌న అలిగారు. సరిగ్గా ఇదే పాయింట్ ను క్యాష్ చేసుకున్నారు ఆమె రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు. తెర వెన‌క దీప భ‌ర్త‌తో మంత‌నాలు జ‌రిపార‌ట‌. కొత్త పార్టీ పెట్టి దీపకు వ‌చ్చే ఓట్ల‌న్నీ చీల్చాల‌ని ప్రోత్సహించార‌ట‌. ఇలా చేస్తే అన్ని రకాల అండ‌గా ఉంటామ‌ని భ‌రోసా ఇచ్చార‌ని టాక్. దీంతో దీప భ‌ర్త కూడా … భార్య‌కు షాకిచ్చేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

దీప భ‌ర్త‌తో ఇదంతా చేయిస్తోంద‌ని చిన్న‌మ్మ వ‌ర్గ‌మేన‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో ఆమె ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి కావ‌డంతో. ఆమెను టార్గెట్ చేశార‌ట‌. అందుకే ఆమె భ‌ర్త‌తో కొత్త పార్టీ పెట్టిస్తున్నార‌న్నే వాద‌న వినిపిస్తోంది. ముఖ్యంగా జ‌య సెంటిమెంట్ ఓట్ల‌న్నీ త‌మ‌కే ప‌డాల‌ని చిన్న‌మ్మ వ‌ర్గం భావిస్తోంది. అయితే దీప‌… జ‌య మేన‌కోడ‌లు కావ‌డంతో.. ఓట‌ర్లు ఆమెవైపు మొగ్గ‌వ‌చ్చ‌న్న ఊహాగానాలు వ‌స్తున్నాయి. దీంతో దీప‌కు ఆ ఓట్ల రాకుండా .. ఈ ఎత్తుగ‌డ వేశార‌న్న వాద‌న ఉంది.

మొత్తానికి దీప భ‌ర్త వెన‌క ఎవ‌రున్నా… ఆయ‌న కొత్త పార్టీ పెడితే.. ఆమెకు ఇబ్బందే. సొంత భ‌ర్తే ఇబ్బంది పెడుతున్న త‌రుణంలో.. ఈ రాజ‌కీయ చ‌ద‌రంగంలో ఆమె త‌న భ‌విష్య‌త్తును ఎలా మ‌లుచుకుంటారో చూడాలి!!!

SHARE