చిన్నమ్మ డైరెక్ట్ ఎటాక్ ..

0
241
chinamma direct attack

Posted [relativedate]

chinamma direct attack
ఇప్పటిదాకా తాను సీఎం కాకుండా అడ్డుపడుతున్న వాళ్ళ పేర్లు చెప్పడానికి మొహమాటపడ్డ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ రూట్ మార్చింది.తన రాజకీయ ప్రత్యర్థుల్ని పేరు పెట్టి ఎటాక్ చేయడం మొదలెట్టింది.పన్నీర్ సెల్వం పార్టీకి ఎన్నడూ విధేయంగా లేడని,ఆయన అమ్మ పట్ల విశ్వాసం లేకుండా వ్యవహరించి అన్నాడీఎంకేని చీల్చాలని చూస్తున్నాడని ఆరోపించింది.అమ్మ ఆస్పత్రిలో వున్నప్పుడు,ఆమె చనిపోయిన వెంటనే కూడా పార్టీని దెబ్బ తీసే ప్రయత్నాలు జరిగాయని శశికళ చెప్పారు.ఆ కుట్రల నుంచి పార్టీని కాపాడుకోడానికి సీఎం పదవి చేపట్టబోతున్నట్టు ఆమె తెలిపారు.జయ కి సోదరిలాంటి దాన్నని,ఆమె మరణం మీద లేనిపోని అనుమానాలు సృష్టించడం మంచిదికాదని శశికళ అభిప్రాయపడ్డారు.

ఇక ప్రస్తుతం అన్నాడీఎంకే ఎదుర్కొంటున్న సంక్షోభానికి బీజేపీ,డీఎంకే కారణమని శశికళ ఆరోపించారు.ఎవరెన్ని అభ్యంతరాలు చెప్పినా,ఎన్ని కుట్రలు చేసినా తాను అధికార పగ్గాలు చేపట్టడం,పార్టీని కాపాడుకోవడం ఖాయమని చిన్నమ్మ ధీమా వ్యక్తం చేశారు.ఈ విధంగా పన్నీర్,బీజేపీ,డీఎంకే ల గురించి పేరుపెట్టి మరీ చిన్నమ్మ డైరెక్ట్ ఎటాక్ చేయడం ఇదే తొలిసారి.

Leave a Reply