చిన్న‌మ్మ వ‌ర్సెస్ ప‌ళ‌నిస్వామి

0
223
chinamma vs palanisamy

Posted [relativedate]

chinamma vs palanisamy
త‌మిళ‌నాడు సీఎం ప‌ళ‌నిస్వామి సీటుకు ఎస‌రు త‌ప్ప‌దా? ఆయ‌న‌పై చిన్న‌మ్మ అసంతృప్తితో ఉందా? ఇక చిన్న‌మ్మ బంధువు దిన‌క‌ర‌న్ ముఖ్య‌మంత్రి కావ‌డం లాంఛ‌నమేనా? ప‌్ర‌స్తుతం అన్నాడీఎంకేలో ఇదే చ‌ర్చ జ‌రుగుతోంది.

ప్ర‌స్తుతానికి త‌మిళ‌నాడులో సీఎం సీటు ఖాళీగా లేదు. అయిన‌ప్ప‌టికీ ముఖ్య‌మంత్రి రేసులో మ‌రో పేరు వినిపించ‌డం అక్క‌డి రాజ‌కీయ అనిశ్చితికి అద్దం ప‌డుతోంది. నిజానికి ప‌ళ‌నిస్వామి అంటే చిన్న‌మ్మ‌కు మొద‌టినుంచి అంత‌గా ఇష్టం లేద‌ట‌. అయితే ఎమ్మెల్యేల క్యాంపులో ఆయ‌నే అన్నీ ద‌గ్గ‌రుండి చూసుకున్నాడు … కాబ‌ట్టి మ‌రో దారి లేక ప‌ళ‌నిస్వామివైపు శ‌శిక‌ళ చూపార‌ని టాక్. అంతేకాకుండా అప్ప‌ట్లో ప‌న్నీర్ సెల్వం దిగిపోవ‌డ‌మే ఆమె ఏకైక ఎజెండా. ఎవ‌రు సీఎం అన్న‌ది త‌ర్వాతి టాపిక్. అలా ఆమె అనుకున్న‌ట్టుగానే జ‌రిగింది. సెల్వం మాజీ సీఎం అయిపోయారు. కాబ‌ట్టి ఇక త‌న‌కు న‌చ్చిన వ్య‌క్తిని ముఖ్య‌మంత్రిని చేసేందుకు ఆమె ప్ర‌య‌త్నిస్తోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

సీఎం ప‌ళ‌నిస్వామి ఇటీవ‌ల బెంగళూరు జైలులో చిన్న‌మ్మ‌ను క‌లిశారు. అయితే ఆయ‌న‌తో చిన్న‌మ్మ స‌రిగా మాట్లాడ‌లేద‌ని టాక్. ఎందుకంటే ఇద్ద‌రి మ‌ధ్య సీఎం మార్పు గురించి చ‌ర్చ జ‌రిగింద‌ని స‌మాచారం. దిన‌క‌రన్ గురించి శ‌శిక‌ళ ప్ర‌స్తావించారని టాక్. దానికి ప‌ళ‌ని కూడా గ‌ట్టిగానే స‌మాధానం ఇచ్చార‌ట‌. బ‌ల‌ప‌రీక్ష‌లో అంత క‌ష్ట‌ప‌డి తాను నెగ్గితే.. వేరు వ్య‌క్తికి ఆ సీటు ఇవ్వ‌డానికి తాను సిద్ధంగా లేన‌ని చెప్పేశార‌ట‌. ఈ స‌మాధానంతో చిన్న‌మ్మ‌కు చిర్రెత్తుకొచ్చింద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

మొత్తానికి అప్పుడే చిన్న‌మ్మ‌… ప‌ళ‌నిస్వామి మ‌ధ్య వార్ మొద‌లైంద‌ని అన్నాడీఎంకే క్యాడ‌ర్ గుస‌గుస‌లాడుకుంటున్నారు. ఈ ప్ర‌భుత్వం కూడా మూన్నాళ్ల ముచ్చ‌ట‌గానే మిగిలిపోతుందేమోన‌ని చ‌ర్చించుకుంటున్నారు. అదే స‌మ‌యంలో మ‌న్నార్గుడి మాఫియా మాత్రం దిన‌క‌ర‌న్ ను సీఎం సీటులో కూర్చోబెట్ట‌డానికి త‌గిన ప్ర‌ణాళిక‌లు రూపొందించే ప‌నిలో ఉంద‌ట‌. అయితే ముఖ్య‌మంత్రి మార్పు విష‌యంలో ఈసారి చిన్న‌మ్మ‌కు షాక్ త‌ప్ప‌ద‌న్న వాద‌న వినిపిస్తోంది. అందుకే ఈ ఊహాగానాలు నిజం కాకూడ‌ద‌ని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కోరుకుంటున్నార‌ట‌!!! నిజ‌మే మ‌రి… అటు తిరిగి ఇటు తిరిగి మ‌ళ్లీ ఇబ్బందులు వారికే క‌దా!!!

Leave a Reply