అప్పు ఉంటే … నో ఫ్లైట్, నో ట్రైన్!!

0
416
chinese supreme court says travelling ban who can not paying bank loan

Posted [relativedate]

chinese supreme court says travelling ban who can not paying bank loanఇక మీదట అప్పు ఉంటే చైనాలో నో ట్రైన్, నో ఫ్లైట్ రూల్ ని తీసుకొచ్చి  చారిత్రక నిర్ణయం తీసుకుంది చైనా సుప్రీం కోర్టు. బ్యాంక్ రుణాలు తీసుకొని ఎగ్గొటిన వారికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. రుణాలు తీర్చే వరకు వారు బుల్లెట్  ట్రైన్స్, ఫ్లైట్స్ ఎక్కి ఇతర ప్రాంతాలకు  వెళ్లకుండా కఠిన చర్యలు చేపట్టింది. అలాగే వీరంది పాన్ నెంబర్స్ ని బ్లాక్ చేసింది.

ఈ క్రమంలో బ్యాంక్ రుణాలను ఎగవేసిన వారితో పాటు ఇన్ కమ్ ట్యాక్స్ కట్టకుండా తప్పించుకుని తిరిగే వారిని కూడా లిస్ట్ అవుట్ చేసింది. దాదాపు 70లక్షల మంది చైనీయులను రుణాల ఎగవేతదారులుగా  లిస్ట్ చేశారు. ఆ లిస్ట్ లో ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ కమిటీల సభ్యులు ఎక్కువగా ఉండడం గమనార్హం. వీరందరూ ఎక్కడికీ వెళ్లకూడదని, వాళ్లకు కొత్త రుణాలు కూడా ఇవ్వరాదని ఆజ్ఞాపించింది చైనా సుప్రీంకోర్టు. అలాగే ఉద్యోగాల్లో ప్రమోషన్లు కూడా ఇవ్వరాదని అధికారులకు సూచించింది.

కాస్త కఠినంగా అనిపించినా ఈ రూల్ ని ఇండియాలో కూడా అమలులోకి తీసుకొస్తే చాలా అవినీతి చేపలు బయటపడతాయని కొందరు నిపుణులు అంటున్నారు. తద్వారా ఇండియాకి ఉన్న అప్పులన్నీ త్వరలోనే తీరి ఇతర దేశాలకు అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతుందని చెబుతున్నారు. మరి చూద్దాం మనదేశంలో కూడా ఆ రూల్ వస్తుందేమో.

Leave a Reply