చిన్నవాడు అక్కడకి వెళ్తున్నాడు..!

Posted December 6, 2016

Chinnavada Remake In Kollywood GV Prakashకుర్ర హీరో నిఖిల్ హీరోగా రీసెంట్ గా వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా ఎక్కడికి పోతావు చిన్నవాడా. విఐ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హెబ్భా పటేల్, నందిత శ్వేత, అవికా గోర్ హీరోయిన్స్ గా నటించారు. టీజర్, ట్రైలర్ తో సినిమా అంచనాలను పెంచేసి అదే తరహాలో సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకొచ్చిన నిఖిల్ తన కెరియర్ లో ఈ సినిమాతో బెస్ట్ హిట్ అందుకున్నాడు. అయితే తెలుగులో ఏదైనా సినిమా హిట్ అయితే వెంటనే ఆ సినిమా రీమేక్ చేసేందుకు పోటీ పడటం కామనే.

రెహమాన్ మేనళ్లుడిగా ముందు మ్యూజిక్ డైరక్షన్ చేసిన జివి దానితో పాటుగా హీరోగా కూడా చేస్తున్నాడు. యూత్ సబ్జెక్ట్స్ తో తమిళ తంబీలను ఆకట్టుకుంటున్న జివి ప్రకాశ్ తెలుగులో హిట్ అయిన సినిమాల మీద ఓ కన్నేసి ఉంచాడు. ఆ క్రమంలోనే ఇప్పుడు చిన్నోడి రీమేక్ చేస్తున్నాడు.

ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా కూడా తమిళంలో రీమేక్ అవుతుంది. నిఖిల్ బదులు అక్కడ జివి ప్రకాస్ హీరోగా నటిస్తాడని తెలుస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. కాన్సెప్ట్ కొత్తగా ఉండటంతో కోలీవుడ్ లో కూడా జివి ఈ సినిమాను చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో సూపర్ హిట్ అవడంతో అక్కడ కూడా అదే ఫలితం అందుకుంటుందని నమ్మకంతో ఉన్నాడు జివి ప్రకాశ్. ఇప్పటికే తెలుగులో సూపర్ హిట్ అయిన ప్రేమ కథా చిత్రం ను తమిళంలో డార్లింగ్ గా రీమేక్ చేసి మంచి ఫలితం అందుకున్నాడు జివి ప్రకాశ్.

SHARE