ప్రత్యేక హోదాతో మాకు పనేంటి…?

0
285
chiranjeevi and balakrishna not responding on ap special status

Posted [relativedate]

chiranjeevi and balakrishna not responding on ap special status
జల్లికట్టు ఉద్యమం ఇచ్చిన స్పూర్తితో ఏపి యువత ప్రత్యేకహోదా కోసం నడుంబిగించిన సంగతి తెలిసిందే. ఇందుకు సాయి ధరమ్, వరుణ్ తేజ్, రామ్, సంపూ వంటి పలువురు సినీ ప్రముఖులు, పవన్ కళ్యాణ్, జగన్, ఎంపీ కవిత వంటి రాజకీయ నాయకులు కూడా మద్దతు తెలిపారు. సంపూ అయితే ఏకంగా మౌన దీక్షలో పాల్గొనడం కోసం వైజాగ్ వెళ్లి అరెస్ట్ కూడా అయ్యాడు. ఇప్పటి వరకు చెప్పిన వాళ్లు కేవలం సినీ హీరోలు, రాజకీయ ప్రముఖులు మాత్రమే. మరి సినీ పరిశ్రమని, రాజకీయాన్ని రెండిటిని బ్యాలెన్స్ చేస్తున్న ఇద్దరు పెద్ద హీరోలు మాటేంటి..? వాళ్లేమీ మాట్లాడరా… ? ఇంతకీ వాళ్లు ఎవరో గుర్తొచ్చిందా.. ఒకరు చిరంజీవి, మరొకరు బాలకృష్ణ.

వీరిద్దరూ సినిమా రంగాన్ని ఏలుతున్న టాప్ హీరోలే కాదు రాజకీయ నేతలు కూడా, రాజ్యాంగ బద్దమైన పదవులను అనుభవిస్తున్నారు కూడా. చిరంజీవి రాజ్యసభ ఎంపీగా కాగా బాలయ్య హిందూపూరం ఎమ్మెల్యే ,అధికార పార్టీ టిడిపి నేత. ఇంత బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉండి కూడా ఏపీ ప్రత్యేక హోదా గురించి ఇంత రచ్చ జరుగుతున్నా.. వారు మాత్రం నోరు మెదపకుండా, ఏమీ పట్టకుండా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. వీరిద్దరూ ప్రత్యేక హోదా కోసం మద్దతు తెలుపుతూ ఎలాంటి ప్రకటన చేయలేదని, ప్రత్యేక హోదా ఉద్యమంతో మాకేంటి పని అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. రాజ్యాంగ బద్ద మైన పదవులు అనుభవిస్తూ ఉండి కూడా ఏపీ ప్రజానీకం రగిలిపోతున్న సమస్యపై స్పందించక పోవడం నిజంగా విచారకరమని అంటున్నారు.

సంక్రాంతి సందర్భంగా విడుదల చేసిన వారి రెండు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయని, ఆ విజయాన్ని అందించింది తెలుగు ప్రజలేని, అయినా వారికి తమ గోడు వినిపించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈ సమయంలో వారి చిత్రాలు విడుదల కావలసి ఉంటే యువతని శాంతిపజేయడానికి ఖచ్చితంగా మద్దతు ప్రకటించేవారని విమర్శిస్తున్నారు. ఇకనైనా తమ సినిమాలు, రాజకీయ భవిష్యత్తు గురించి మాత్రమే కాకుండా వారు ఆయా స్థానాల్లో నిలబడ్డంలో భాగస్వాములైన ఏపి ప్రజల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలని కోరుతున్నారు.

Leave a Reply