Posted [relativedate]
మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ఈ మెగా బ్రదర్స్ కి తెలుగు అభిమానుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. వాళ్లకి ఉన్న ఇమేజ్ ని, ఫాలోయింగ్ ని, క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని నిర్మాత, ఎంపీ టి. సుబ్బిరామిరెడ్డి రీసెంట్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో మెగా బ్రదర్స్ తో మల్టీస్టారర్ ని ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
చిరంజీవి 150వ చిత్రం భారీ విజయం సాధించిన నేపథ్యంలో సన్మాన సభ ఏర్పాటు చేసిన సుబ్బిరామిరెడ్డి… చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో సినిమా చేయబోతున్నట్లు, ఈ సినిమాను తాను, అశ్వినీదత్ కలిసి భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన రాగానే ఇక మెగా అభిమానులు ఎగ్జైట్ మెంట్ నెలకొంది. సినిమాకు సంబంధించిన తాజా విషయాల గురించి మెగా బ్రదర్స్ ఏమైనా నోరు విప్పుతారేమోనని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి ఆసక్తికి తగ్గుట్టుగానే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ నగర్లో హల్ చల్ చేస్తోంది.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మెగా బ్రదర్స్ తో పాటు త్రివిక్రమ్ కి కూడా రెమ్యూనరేషన్ భారీగా ఇవ్వబోతున్నారట. చిరంజీవికి రూ. 25 కోట్లు, పవన్ కళ్యాణ్ కు రూ. 25 కోట్లు, త్రివిక్రమ్ కు రూ. 15 కోట్లు రెమ్యూనరేషన్ గా ఇవ్వబోతున్నారట. కేవలం ఈ ముగ్గురి రెమ్యూన్ రేషన్ కే రూ. 65 కోట్లు ఖర్చు చేస్తే… ఇక హీరోయిన్లు, మిగతా క్యాస్టింగ్, టెక్నీషియన్లు, సినిమా చిత్రీకరణ, కలిపి మొత్తం ఎంత ఖర్చు చేస్తారో అని చర్చించుకుంటున్నారు. మరి ఈ విషయాల్లో నిజమెంతో తెలియాలంటే మెగా బ్రదర్స్ చెప్పేవరకు వెయిట్ చెయ్యక తప్పదు.