ఆటో జానీ ట్రాక్ ఎక్కేశాడు!!

0
385
chiranjeevi and puri jagannath auto johnny movie fix

Posted [relativedate]

chiranjeevi and puri jagannath auto johnny movie fix
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా మెగాస్టార్ గురించే చర్చించుకుంటున్నారు. చిరు మళ్లీ తన పూర్వపు వైభవాన్ని సంతరించుకున్నాడని, ఇక వరస సినిమాలు చేయనున్నాడని, ఆ మెగా ప్లేస్ లో ఆయన తప్ప ఎవరూ నిలబడలేరని చెప్పుకుంటున్నారు. మెగాస్టార్ కి ఇంత క్రేజ్ రావడానికి కారణం ఆయన నటించిన ఖైదీ నెం. 150. నిజానికి ఆయన 150 సినిమాగా ఆటోజానీ తెరకెక్కాలని, ఈ సినిమాకు పూరీ జగన్నాద్ దర్వకత్వం వహించాల్సి ఉందని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కానీ అప్పుడు ఆ ఛాన్స్ మిస్ అయ్యాడు పూరి.

తాజా సమాచారం ప్రకారం చిరు 153 వ సినిమాగా … ఆటోజానీని తెరకెక్కించనున్నాడు పూరీ. ఇటీవల చిరు ఇచ్చిన పార్టీకీ పూరీ హాజరయ్యాడని, ఇరువురు కలిసి ఈ ప్రాజెక్టు గురించి చర్చించుకున్నారని మెగా కాపౌండ్ చెబుతోంది. కధలో కొన్ని మార్పులు కూడా చేశారట. 151,152 సినిమాలను త్వరగా కంప్లీట్ చేసి వచ్చే సంవత్సరం ఈ సినిమాను ట్రాక్ లోకి తీసుకురానున్నాడట చిరు.

Leave a Reply