బాబు ప్లీజ్‌.. ఒక్కసారి రావా?

Posted April 19, 2017

chiranjeevi invited mahesh babu to meelo evaru koteeswarudu tv show
మెగాస్టార్‌ చిరంజీవి సినిమాల్లోకి ‘ఖైదీ నెం.150’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చి భారీ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకున్నాడు. ఆ ఉత్సాహంతోనే బుల్లి తెరపై ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంతో ఆకట్టుకోవాలని చిరు భావించాడు. అయితే గతంలో నాగార్జున చేసిన సమయంలో వచ్చిన టీఆర్‌పీ కంటే చిరంజీవి మొదలెట్టినప్పటి నుండి టీఆర్‌పీ పడిపోయింది. చిరంజీవి బుల్లి తెరపై ఆకట్టుకోలేక పోతున్నాడు. దాంతో గెస్ట్‌లతో కార్యక్రమాన్ని నెట్టుకు వస్తున్నారనే విషయం తెల్సిందే. ఇప్పటికే పలువురు గెస్ట్‌లు ఈ కార్యక్రమంలో చిరంజీవితో ముచ్చటించిన విషయం తెల్సిందే. ఇక త్వరలోనే సీజన్‌ ముగియనున్న నేపథ్యంలో మహేష్‌బాబును గెస్ట్‌గా తీసుకు రావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

చిరంజీవి మరియు మహేష్‌బాబుల మద్య సన్నిహిత్యం ఉంటుంది. గతంలో పలు సార్లు చిరంజీవి ఏదైనా వేడుకలు నిర్వహిస్తే మహేష్‌బాబు హాజరు అయిన దాఖలాలు ఉన్నాయి. అందుకే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంకు చిరంజీవి స్వయంగా మహేష్‌బాబును ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం నటిస్తున్న ‘స్పైడర్‌’ చిత్రంకు ప్రమోషన్‌ అన్నట్లుగా కూడా ఉంటుందని మహేష్‌బాబును ఒప్పించేందుకు కార్యక్రమం నిర్వాహకులు ప్లాన్‌ చేస్తున్నారు. మరి మహేష్‌బాబు ఒప్పుకుని వస్తాడా అనేది చూడాలి.

SHARE